బయటకు వెళ్లిన భార్య ఇంటికి వచ్చేసరికి భర్త వంట చేసి పెడితే ఎంత బాగుంటుంది. ఇదే పని ఓ భర్త చేస్తే.. అతని భార్య భయంతో వణికిపోయింది. ఎందుకో తెలుసా..? ఆయన వండింది ఏ చికెనో, మటనో కాదు.. మనిషి మాంసం. మీరు చదివింది నిజమే.  ఓ వ్యక్తి మనిషి మాంసంతో వంట చేశాడు. ఈ సంగటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజనూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజనూర్ పట్టణ సమీపంలోని టిక్కోపూర్ గ్రామానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి మనిషి మాంసంతో వంట చేశాడు. కూరగాయాలు తేవడానికి మార్కెట్ వెళ్లిన భార్య ఇంటికి వచ్చి చూడగా.. భర్త వంట చేస్తూ కనిపించాడు.

Also Read యువతితో దొంగ బాబా ప్రేమాయణం, స్టైల్ మార్చి టిక్ టాక్ వీడియోలు, చివరకి....

కడాయిలో మనిషి చేతులు, కాళ్లు ఉండటాన్ని చూసి ఆమె షాకయ్యింది. భర్త ఓ మనిషి మాంసంతో వంట  చేస్తున్నాడన్న విషయాన్ని గ్రహించేసరికి ఆమె ముందు షాకయ్యింది. తర్వాత తేరుకొని ఇంటికి తలుపులు వేసి ఇరుగు పొరుగువారికి సమాచారం అందించింది.

వారు విషయం తెలుసుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా నిజంగానే అతను మనిషి మాంసంతో వంట చేస్తూ కనిపించాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

సంజయ్ మద్యం మత్తులో గంగా నదీ తీరంలోని శ్మశానవాటిక నుంచి మనిషి చేతి మాంసాన్ని తీసుకువచ్చి కడాయిలో వేసి వండుతున్నాడని తేలింది. పోలీసులు సంజయ్ ను అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు.  కాగా భర్త చేసిన పనికి బెంబేలెత్తిపోయిన సదరు మహిళ.. ఇంటికి వెళ్లడానికి కూడా భయపడుతుండటం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.