అతనో దొంగబాబా. మాయ మాటలు చెప్పి ప్రజల సొమ్ము కాజేస్తూ ఉంటాడు. అలాంటి బాబా వద్దకు ఓ యువతి పాద పూజ చేద్దామని వచ్చింది. ఆ యువతి అందానికి ఈ దొంగ బాబా ఫిదా అయిపోయాడు. వెంటనే మాయ మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. ఎవరికీ తెలీకుండా యవతితో పరారై పెళ్లి కూడా చేసుకున్నాడు. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మార్చి టిక్ టాక్ వీడియోలు చేశాడు.  ఆ వీడియోలే అతనిని చివరకు పోలీసులకు పట్టించాయి. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దత్తాత్రేయ అవధూత స్వామిజీ గా పేరొందిన ఓ దొంగబాబా... తన పూజకు వచ్చిన యువతిపై కన్నేశాడు. ఆమె అందానికి దాసోహమై...  యువతికి మాయమాటలు చెప్పాడు. ఆమెను ప్రేమ మత్తులోకి దింపి యువతితో సహా లేచిపోయాడు. మరోవైపు యువతి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read కన్యత్వ పరీక్ష.. పెద్ద కొడుకు గదిలోకి పంపి అత్యాచారం: కోడలి పట్ల అత్త దారుణం...

అయితే... యువతి తీసుకొని మంగళూరు సమీపంలోని గోకర్ణలోని ఓ గెస్ట్ హౌస్ లో దొంగ బాబా మకాం వేశాడు. అప్పటి వరకు కాశాయం దుస్తులు, గుబురు గడ్డంతో ఉన్న ఆ బాబా.. యువతిని పెళ్లి చేసుకోగానే స్టైల్ మార్చేశాడు. గడ్డం తీసేసి.. హీరో మాదిరి తయారయ్యాడు.

అక్కడితో ఆగకుండా సదరు యువతితో టిక్ టాక్ వీడియోలు చేశాడు. అవి కాస్త యువతి తల్లిదండ్రుల కంట పడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యువతి, ఆ దొంగ బాబా ఎక్కడ ఉన్నారో గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

తీరా అదుపులోకి తీసుకున్నాక యువతి ప్లేట్ ఫిరాయించింది. అతను తనను బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. పాదపూజ కోసం వెళితే భయపెట్టి మరీ పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు అతనిపై 420 కేసు నమోదు చేశారు. మరోవైపు తమ కూతురిని బలవంతంగా ఎత్తుకుపోయాడని ఆమె తల్లిదండ్రులు, తమ దగ్గర డబ్బులు కాజేశాడంటూ మరికొందరు అతనిపై కేసులు పెట్టారు. మొత్తంగా ఆ ఫేక్ బాబా మీద 9కేసులు నమోదయ్యాయి.