Asianet News TeluguAsianet News Telugu

బాబోయ్.. వ్యక్తి చేతిని కొరికి, నీటిలోకి లాగిన షార్క్.. వీడియో వైరల్...

బుల్ షార్క్ వ్యక్తి చేతిపై దాడి చేసి.. నీటిలోకి లాగింది.  ఈ భయంకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shark bite man's hand and dragged him into the water, Video viral - bsb
Author
First Published Jun 27, 2023, 1:15 PM IST

ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో షార్క్ ఒక మత్స్యకారుడి చేతిని కొరికి, అతడిని నీటిలోకి లాగిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది. పడవలో చేపలు పట్టడానికి వెళ్లిన అతను చేతులు కడుక్కోవడానికి పడవలో ఓ వైపునుంచి నీళ్లలో చేతులు పెట్టి కడుక్కుంటున్నాడు. ఆ సమయంలో ఈ దాడి జరిగింది. 

సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఒక పెద్ద షార్క్ నీటిలో పెట్టిన మత్స్యకారుడి చేతిని కొరుకుతున్నట్లు కనిపిస్తుంది. షార్క్ ఆ వ్యక్తి చేతిని కొరికి.. లాగేసరికి.. అతను పడవ నుండి నీటిలోకి పడిపోయాడు. అది గమనించిఅతని తోటి మత్స్యకారులు అతన్ని పడవలో వెనక్కి లాగడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. 

న్యూయార్క్‌లో దీపావళికి స్కూల్ హాలీడే.. ప్రకటించిన మేయర్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను మైఖేల్ అనే వ్యక్తి షేర్ చేశాడు. అతను ఆ సమయంలో బోటులోనే ఉన్నాడు. ఇది తాను సజీవంగా కళ్లతో చూసిన అతి భయంకరమైన ఘటన అని, అది "భయకరమైన రోజులలో" ఒకటని చెప్పాడు.

''స్నూక్‌ని రిలీజ్ చేసిన తరువాత, ఎలర్జన్ అనే బాధితుడు నీటిలో చేతులు కడుక్కుంటున్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద బుల్ షార్క్ హఠాత్తుగా వచ్చి అతని చేతిని కరిచింది. నీటిలో చమ్ లేదా రక్తం వాసనతో సొరచేపలు ఆకర్షించబడతాయి. అయితే, ఈ ఘటన సమయంలో అలాంటివేవీ లేకపోయినా దాడి జరిగింది. అందుకే పడవల్లో ప్రయాణం చేసేప్పుడు చేతులను నీటి నుండి దూరంగా ఉంచొద్దని చేసే హెచ్చరికలు వినాలి. ఈ ఘటనను ఒక పాఠంగా తీసుకోండి. మీ చేతులను నీటికి దూరంగా ఉంచండి. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చు ”అని అతను క్యాప్షన్‌లో రాశాడు.

సంఘటన తర్వాత, బాధితుడిని జాక్సన్ సౌత్ మెడికల్ సెంటర్‌కు విమానంలో తరలించారు. పార్క్ రేంజర్లు, అతనికి చికిత్స చేసిన వైద్యులు అతని గాయాలు షార్క్ కాటుకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. అయితే, అతని చేతికి గాయం ఏ మేరకు అయ్యింది. ప్రస్తుతం అతనిపరిస్థితి ఏంటి అనే విషయాల వివరాలు వెల్లడించలేదు.

"ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో షార్క్ ఇలా దాడి చేయడం చాలా అసాధారణం అయితే, పార్క్ లో వన్యప్రాణుల దగ్గరగా వెళ్లొద్దని.. ఆ సమయంలో సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ చెబుతున్నాం" అని నేషనల్ పార్క్ సర్వీస్ తెలిపింది. పర్యాటకులు ఎలిగేటర్లు, మొసళ్ళు, విషపూరిత పాములు, ఇతర మాంసాహార జంతవులు ఆ పార్కులో అతి సాధారణం. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 

 యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా ఇంటర్నేషనల్ షార్క్ అటాక్ ఫైల్ ప్రకారం, గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 57 అసంకల్పిత షార్క్ దాడుల ఘటనలు నమోదయ్యాయి. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios