విమానంలో పక్కసీట్లో 30 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్.. ఆ మహిళ వెన్నులో వణుకు.. వైరల్ గా మారిన ఫొటో...
సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ కు చెందిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విమానంలో అతని పక్కసీట్లో కూర్చున్న ఓ మహిళ భయంభయంగా అతడిని చూస్తున్న ఫొటో అది.
సోషల్ మీడియాలో ఇప్పుడొక ఫొటో వైరల్ గా మారింది. అది విమానంలో తీసిన ఫొటో.. ఓ వ్యక్తిని అతని పక్కనున్న మహిళ భయంభయంగా చూస్తున్న ఫొటో.. ఇంతకీ అతనెవరు? ఆమె ఎందుకంత భయపడిపోతోంది? దీనిమీద నెటిజన్లు ఎందుకంత తీవ్రంగా స్పందిస్తున్నారు... వివరాల్లోకి వెడదాం.
సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్.. ఇటీవలే నేపాల్ జైలునుంచి విడుదలై స్వస్థలం ప్రాన్స్ కు వెళ్లాడు. అయితే ఈ సమయంలో విమానంలో అతని పక్కసీట్లో కూర్చున్న మహిళ ఫొటో అది. దీన్ని ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో ఫ్రాన్స్ కు దోహా మీదుగా వెడుతుండగా తీసిన ఫొటో అది. అంతే.. కామెంట్లు వరదలా ప్రవహిస్తున్నాయి. ఆ మహిళ జీవితంలో ఇది అత్యంత భయంకరమైన విమానప్రయాణం అని ఒకరు, నేను ఆ స్థానంలో ఉంటే నా పరిస్థితి ఏంటి.. అని ఒకరు.. మీరు ఆ మహిళ ప్లేస్ లో కూర్చునే సాహసం చేస్తారా? అని మరొకరు..ఇలా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
ఇంకొకరైతే.. క్రిస్మస్ సీజన్ లో సొంతవారిని కలవడానికి వెడుతున్న ఆమెకు టికెట్ దొరికిందన్న ఆనందం క్షణాల్లో ఆవిరైపోయి ఉండొచ్చని కామెంటారు. 30మంది విదేశీయులను అత్యంత క్రూరంగా హతమార్చి.. బికినీ కిల్లర్ గా ప్రపంచాన్ని గడగడలాడించిన ఓ నేరస్తుడు.. ఎంత మారిపోయినా.. తమ పక్కనే కూర్చుంటే.. వెన్నులోంచి వణుకు పుట్టడం అతి మామూలు విషయం.. ఆ మహిళ విషయంలోనూ అదే జరిగింది.
1970-80ల్లో భారత్ తో పాటు అనేక వివిధ దేశాల్లో 30హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78). డబ్బుకోసం అతను సీరియల్ కిల్లింగ్స్ చేసేశాడు. విదేశీయులను ముఖ్యంగా యువతులనే టార్గెట్ చేసి చంపేసేవాడు.
సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలునుంచి విడుదల.. ఫ్రాన్స్ కు తరలింపు..
ఇదిలా ఉండగా, డిసెంబర్ 23న 20 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత సత్ప్రవర్తన కింద.. ఆరోగ్య కారణాల రీత్యా.. 78 సంవత్సరాల చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలు నుంచి విడుదలయ్యాడు. చార్లెస్ శోభరాజ్ కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ గా ప్రపంచాన్ని వణికించాడు. 1970ల్లోనే పదుల సంఖ్యలో విదేశీయులను హత్య చేసి.. ప్రకంపనలు సృష్టించాడు. పాశ్చాత్య దేశాల నుంచి ఆసియా పర్యటనకు వచ్చే వారితో.. పరిచయం పెంచుకుని స్నేహం చేసి ఆ తర్వాత వారికి మత్తుమందు ఇచ్చి.. చంపేసేవాడు. చివరకు 2003లో ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులను చంపిన కేసులో శోభరాజ్ అరెస్టయ్యాడు.
19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. అధికారులు చార్లెస్ శోభరాజ్ ను ఫ్రాన్స్కు పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర అమెరికాకు చెందిన పర్యాటకులను చంపిన కేసులో 2003లో అరెస్టయిన అతడికి నేపాల్ సుప్రీం కోర్టు జీవిత ఖైదు విధించింది. నేపాల్లో జీవిత ఖైదు అంటే 20 సంవత్సరాలు. అయితే అక్కడి చట్టాల ప్రకారం శిక్షా కాలంలో 75 శాతం పూర్తి చేసుకుని సత్ప్రవర్తన కలిగి ఉంటే.. ఖైదీలను ముందుగానే విడుదల చేస్తారు. ఈ విషయం తెలిసిన శోభరాజ్ సుప్రీంకోర్టులో తనను విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. శోభరాజ్ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు వృద్ధాప్య కారణాలు కూడా ఉండడం వల్ల అతనిని విడుదల చేయాలని ఆదేశించింది.