Asianet News TeluguAsianet News Telugu

సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ నేపాల్ జైలునుంచి విడుదల.. ఫ్రాన్స్ కు తరలింపు..

శుక్రవారం నేపాల్ జైలునుంచి సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదలయ్యాడు. అతడిని ఫ్రాన్స్ కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Serial killer Charles Sobhraj released from nepal jail
Author
First Published Dec 23, 2022, 2:09 PM IST

నేపాల్ : చార్లెస్ శోభరాజ్ ఈ పేరు వినగానే వెన్నులో వణుకు పుట్టేది. కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ గా ప్రపంచాన్ని వణికించాడు. 1970ల్లోనే పదుల సంఖ్యలో విదేశీయులను హత్య చేసి.. ప్రకంపనలు సృష్టించాడు. పాశ్చాత్య దేశాల నుంచి ఆసియా పర్యటనకు వచ్చే వారితో.. పరిచయం పెంచుకుని స్నేహం చేసి ఆ తర్వాత వారికి మత్తుమందు ఇచ్చి..  చంపేసేవాడు. చివరకు 2003లో ఉత్తర అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులను చంపిన కేసులో శోభరాజ్ అరెస్టయ్యాడు. 19 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత సత్ప్రవర్తన కింద.. ఆరోగ్య కారణాల రీత్యా..  అతడిని అరెస్టు చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు 78 సంవత్సరాల చార్లెస్ శోభరాజ్ శుక్రవారం నేపాల్ జైలు నుంచి విడుదలయ్యాడు.

19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అతడిని ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. అధికారులు చార్లెస్ శోభరాజ్ ను ఫ్రాన్స్కు పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర అమెరికాకు చెందిన పర్యాటకులను చంపిన కేసులో 2003లో అరెస్టయిన అతడికి నేపాల్ సుప్రీం కోర్టు జీవిత ఖైదు విధించింది. నేపాల్లో జీవిత ఖైదు అంటే 20 సంవత్సరాలు. అయితే అక్కడి చట్టాల ప్రకారం శిక్షా కాలంలో 75 శాతం పూర్తి చేసుకుని సత్ప్రవర్తన కలిగి ఉంటే.. ఖైదీలను ముందుగానే విడుదల చేస్తారు. 

19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్న ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్.. నేపాల్ కోర్టు సంచలన ఆదేశం

ఈ విషయం తెలిసిన శోభరాజ్ సుప్రీంకోర్టులో తనను విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. శోభరాజ్ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు వృద్ధాప్య కారణాలు కూడా ఉండడం వల్ల అతనిని విడుదల చేయాలని ఆదేశించింది. చార్లెస్ శోభరాజ్ చిన్నతనంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నేరాల బాటపట్టాడు. చార్లెస్ శోభరాజ్ తండ్రి భారత పౌరుడు.. తల్లి వియత్నం పౌరురాలు. శోభరాజ్ పుట్టిన కొద్ది రోజులకే తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోయారు. తల్లి రెండో భర్త శోభరాజ్ ను దత్తత తీసుకున్నాడు. కానీ వారికి పిల్లలు పుట్టడంతో శోభరాజ్ ను నిర్లక్ష్యం చేశారు. అదే అతనిలో నేర ప్రవృత్తిని పెంచింది.

దీంతో 1977లో ఆగ్నేయాసియా దేశాల్లోచార్లెస్ శోభరాజ్ అంటే  భయందోళనలు పుట్టించాడు. దోపిడీలకు, వరుస హత్యలకు పాల్పడేవాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చార్లెస్ శోభరాజ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాతి కాలంలో అనేక హత్యలు చేసినప్పటికీ 20 హత్య కేసుల్లో శోభరాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది.  1976లో ఢిల్లీలోని ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషమిచ్చి చంపిన కేసులో అరెస్టయ్యాడు. ఆ తర్వాత వివిధ కేసుల్లో భారత్లోని అనేక జైళ్ళలో 21 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు. 

అప్పట్లోనే డ్రగ్స్ వాడకంలో చార్లెస్ శోభరాజ్ అందెవేసిన చేయి.  భారత్లోని ఓ జైల్లో ఉండగా ఒకసారి అక్కడి సిబ్బందికి పార్టీ ఇచ్చాడు. వారికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చి.. వారు ఆ మత్తులో ఉండగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడిని తీవ్రంగా గాలించి అరెస్టు చేశారు. చార్లెస్ శోభరాజ్ ను ‘బికినీ కిల్లర్’ అని కూడా పిలుస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios