రోడ్డుపై స్కూటర్ మీదినుంచి పడిన వ్యక్తి.. కారు ఆపి, యోగక్షేమాలు కనుక్కున్న రాహుల్ గాంధీ.. వీడియో వైరల్..
రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు వెళుతుండగా స్కూటర్‌పై నుంచి కిందపడిన ఓ వ్యక్తిని చూసి, ఆగి అతడి బాగోగులు కనుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తరువాత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ రోజు లోక్‌సభకు బయలుదేరారు. ఆ సమయంలో పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ముందు జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు వెళుతుండగా రోడ్డుపై ఓ వ్యక్తి స్కూటర్‌పై నుంచి కిందపడి కనిపించారు. ఆ వ్యక్తిని పలకరించడాని రాహుల్ తన కారును ఆపి, కిందికి దిగారు. ఆ తరువాత అతని బాగోగులు కనుక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాంగ్రెస్ తన అధికారిక అకౌంట్ లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
53 ఏళ్ల రాహుల్ గాంధీ స్కూటర్ దగ్గరకు వెళ్లి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘దెబ్బలేమైనా తగిలాయా’ అని అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ గా ‘పీపుల్స్ హీరో’ అనే క్యాప్షన్ పెట్టారు.
ఆ తరువాత పార్లమెంట్ లో ప్రసంగించిన రాహుల్ మణిపూర్‌లో భారతదేశాన్ని హత్య చేశారని, ఇప్పుడు హర్యానాను తగులబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"మా ప్రధాని హింసాత్మక మణిపూర్‌ను సందర్శించలేదు. ఆయనకు మణిపూర్ భారతదేశంలో భాగం కాదు. మణిపూర్ రెండుగా చీలిపోయింది. ప్రభుత్వ రాజకీయాలు మణిపూర్‌లో భారతదేశాన్ని హత్య చేశాయి" అని ఆయన అన్నారు. "మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా, మీరు భారత మాత హంతకులు.. దేశద్రోహులు, దేశభక్తులు కాదు" అని రాహుల్ గాంధీ అన్నారు.