Asianet News TeluguAsianet News Telugu

చెత్తకుప్పలో రూ.25 కోట్ల నోట్ల కట్టలు..! చెత్త ఏరుకునే వ్యక్తిని వరించిన అదృష్టం..కానీ, అంతలోనే...

అసలు ఈ కరెన్సీ ఒరిజినల్ వా? లేక నకిలీవా? అని తేల్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించినట్లుగా  తెలిపారు. 

Ragpicker finds Bundles of Rs. 25 crore worth notes in garbage  In Bengaluru - bsb
Author
First Published Nov 10, 2023, 7:14 AM IST

బెంగళూరు :  కొన్ని ఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి.. అప్పటివరకు ఉన్న జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయి. అలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలోని బెంగళూరులో ఓ చెత్త ఏరుకునే వ్యక్తి జీవితంలో వెలుగు చూసింది. రోజులాగే చెత్త ఏరుకుంటుంటే కట్టల కొద్ది కరెన్సీ దొరికింది. దాదాపు దాని విలువ రూ.25 కోట్లు ఉంటుందని తేలింది. ఇంకేముంది లైఫ్ సెట్ అనుకున్నారు. కానీ మరో షాకింగ్ విషయం తెలిసి.. ఆశ్చర్యంతో అవాక్కయ్యారు. ఇంతకీ ఎం జరిగిందంటే…

బెంగళూరులో ఓ వ్యక్తి చెత్త ఏరుకుంటూ జీవిస్తాడు. నవంబర్ ఒకటవ తేదీన రోజులాగే తన పనిలో ఉండగా ఓ మూట దొరికింది.అందులో 23 నోట్ల కట్టలు ఉన్నాయి. అవి చూసిన అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే, అవి మన ఇండియన్ కరెన్సీ కాదు.. కొత్తగా అనిపించాయి. అవి అమెరికన్ డాలర్ల కట్టలని తరువాత తెలిసింది. ఏదైనా కరెన్సీ నే కదా.. వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. రూపాయలకట్టలైతే ఎవరికి చెప్పకుండా దాచుకోవడమో, ఖర్చు పెట్టడం చేసేవాడేమో. కానీ, అవి డాలర్లు అయ్యేసరికి ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. కరెన్సీ అని మాత్రం తెలుస్తోంది.

గుడ్ న్యూస్ : ఢిల్లీలో చిరుజల్లులు... వర్షం కారణంగా తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..

అలా ఓ నాలుగు రోజులు తన దగ్గరే ఆ డబ్బులు పెట్టుకున్నాడు.. తర్వాత నవంబర్ 5వ తేదీన తన యజమాని బప్పా దగ్గరికి వెళ్లి విషయం చెప్పి ఆ డబ్బులు అప్పచెప్పాడు. బప్పా కూడా ముందు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ సామాజిక కార్యకర్త కలిమూల్లాహ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. వెంటనే వీరిద్దరూ కలిసి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ దగ్గరికి చేరుకున్నారు. చెత్తకుప్పలో దొరికిన డాలర్ల నోట్ల కట్టలను చూపించాడు.. విషయాన్ని వివరించారు. 

వెంటనే స్పందించిన దయానంద దీనిమీద విచారణ జరపాలని హెబ్బల్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత నోట్ల కట్టలను పరిశీలించిన పోలీసులు వాటి మొత్తం విలువ దాదాపుగా రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక పోలీసుల దర్యాప్తులో నోట్ల మీద రసాయనాలు పూసినట్లుగా గుర్తించారు.  అసలు ఈ నోట్లు  ఒరిజినలేనా? నకిలీ వా? అని అనుమానిస్తున్నారు. మరోవైపు బ్లాక్ డాలర్స్ స్కాంకు పాల్పడుతున్న ముఠాకి చెందిన కరెన్సీ నోట్లు కావచ్చు అని… ఏదో సమస్య వల్ల అక్కడ వదిలేసి పోయి ఉంటారని అనుకుంటున్నారు. అసలు ఈ కరెన్సీ ఒరిజినల్ వా? లేక నకిలీవా? అని తేల్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించినట్లుగా  తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios