Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ : ఢిల్లీలో చిరుజల్లులు... వర్షం కారణంగా తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..

ఢిల్లీ నగరాన్ని కమ్మేసి.. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వాయు కాలుష్యానికి చెక్ పడింది. ఢిల్లీలో చిరుజల్లులు కురుస్తున్నాయి. 

Rain check for air pollution in Delhi - bsb
Author
First Published Nov 10, 2023, 6:44 AM IST

ఢిల్లీ : ఢిల్లీలో శుక్రవారం ఉదయం చిరుజల్లులతో వర్షం పడుతోంది. వర్షం కారణంగా ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొద్ది రోజులుగా వాయు కాలుష్యంతో బాధపడిన ఢిల్లీ నగరం కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. వర్షం కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గింది. దీంతో ఢిల్లీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఢిల్లీలో గత కొద్ది రోజులుగా గాలి నాణ్యత అకస్మాత్తుగా క్షీణించడంతో ఢిల్లీ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంది. స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది. వాహనాల వినియోగంలో సరి, బేసి విధానం తీసుకొచ్చింది. ఢిల్లీ పొరుగున ఉన్న గురుగ్రామ్ కూడా కాలుష్య నివారణకు చర్యలు చేపట్టింది. 

గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్‌లు కలిసి ఉన్న జాతీయ రాజధాని ప్రాంతంలో - కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్ అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను నిషేధించింది. నగరంలోకి డీజిల్ ట్రక్కుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు.

రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఏటా పెరుగుతున్న కాలుష్యాన్ని పరిష్కరించడానికి రూపొందించిన గ్రేడెడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్లాన్ స్టేజ్ IIIలో భాగంగా అనేక ఇతర చర్యలు కూడా అమలులోకి వస్తాయి. చెత్త, ఆకులు, ప్లాస్టిక్, రబ్బరు వంటి వ్యర్థ పదార్థాలను కాల్చడంపై నిషేధం విధించారు. గురుగ్రామ్ జిల్లా మేజిస్ట్రేట్ ఇది శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్టం కిందికి వస్తుందని తెలిపారు.

గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3వ దశ అమలుపై చర్చించేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్ని సంబంధిత శాఖలతో ఈ సమావేశం నిర్వహించనున్నాం.. అని తెలిపారు.  

ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఈ సీజన్‌లో మొదటిసారిగా "తీవ్రమైన" మార్కును తాకాయి. నవంబర్ 2న సాయంత్రం 5 గంటలకు 402 కు చేరుకున్నాయి. వచ్చే రెండు వారాల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని "తీవ్రమైన" విభాగంలో నమోదు చేశాయి.

ఏక్యూఐ 400 మార్కును అధిగమించిన ప్రాంతాలలో ఆనంద్ విహార్ (450), బవానా (452), బురారీ క్రాసింగ్ (408), ద్వారకా సెక్టార్ 8 (445), జహంగీర్‌పురి (433), ముండ్కా (460), ఎన్ఎస్ఐటీ ద్వారక (406), నజఫ్‌గఢ్ (414), నరేలా (433), నెహ్రూ నగర్ (400), న్యూ మోతీ బాగ్ (423), ఓఖ్లా ఫేజ్ 2 (415), పట్పర్‌గంజ్ (412), పంజాబీ బాగ్ (445), ఆర్ కె పురం (417), రోహిణి (454) ), షాదీపూర్ (407)  వజీర్‌పూర్ (435)లు ఉన్నాయి. 

ఏక్యూఐ స్థాయి 400 కంటే ఎక్కువగా ఉంటే 'తీవ్రమైనది'గా పరిగణించబడుతుంది. ఇలాంటప్పుడు వాయుకాలుష్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి వచ్చిన డేటా ప్రకారం, ఢిల్లీ గాలి నాణ్యత 2020 అక్టోబర్‌ నుండి అధ్వాన్నంగా ఉంది. వర్షాభావ పరిస్థితులే దీనికి కారణమని వాతావరణ నిపుణులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios