Asianet News TeluguAsianet News Telugu

పెంపుడు కుక్క విశ్వాసం.. తన యజమానికి సరిపోయే కిడ్నీ దాతను కనిపెట్టింది.. ప్రాణాలు కాపాడింది..

ఒక పెంపుడు కుక్క తన యజమానికి సరిపోయే కిడ్నీ దాతను కనిపెట్టిన అరుదైన ఘటన వెలుగు చూసింది. పెంపుడు జంతువు డోబెర్‌మాన్ తన యజమానురాలికి ప్రాణదాతగా మారింది. '22 మిలియన్లలో ఒకరికి కుదిరే దాతను’ గుర్తించింది. 

Pet dog found a matching kidney donor for her owner and saved his life - bsb
Author
First Published Apr 26, 2023, 12:55 PM IST

ఒక పెంపుడు కుక్క దాని యజమాని ప్రాణాలను కాపాడింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన యజమానికి సరిపోయే మ్యాచ్ ను గుర్తించి.. ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించింది. ఆశ్చర్యంగా ఉందా? కిడ్నీదాతను కుక్క గుర్తించడం ఏంటీ? అని ముక్కున వేలేసుకుంటున్నారా? అయితే.. ఇది నిజ్జంగా జరిగింది. అలా ఓ కుక్క తన యజమానికి మ్యాచ్ అయ్యే డోనర్ ను వెతకడి అనేది చాలా అరుదు.. అంతేకాదు... ఇలా మ్యాచ్ అవ్వడం కూడా 22 మిలియన్లలో ఒకరికి జరుగుతుందట. అది ఆమె విషయంలో జరిగింది. 

లూసీ హంఫ్రీ కిడ్నీ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో సంవత్సరాలు గడిపేసింది. ఆ తర్వాతే తన పెంపుడు కుక్కే తనకు '22 మిలియన్లలో ఒక' కిడ్నీ దాతను గుర్తించింది. డైలీ మెయిల్ ఈ విషయాన్ని నివేదించింది. లూసీ తన కుక్కలు జేక్, ఇండీని సౌత్ వేల్స్‌లోని ఒక బీచ్‌కి తీసుకువెళ్లింది. ఇండీ ఉత్సాహంగా 100 గజాల దూరంలో ఉన్న అపరిచితురాలి వద్దకు పరుగెత్తింది. ఆ తరువాత ఆమెను ఒంటరిగా వదిలిపెట్టలేదు. దీంతో కుక్క యజమాని, అపరిచితురాలు కేటీ జేమ్స్ మధ్య సంభాషణకు ఇది ప్రారంభ బిందువుగా మారింది. 

విమానంలో ప్రయాణికుల గొడవ.. వాగ్వాదంలో కిటికీ పగులగొట్టడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. నలుగురు అరెస్ట్ (వీడియో)

లూసీ కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఇంకా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. వీరు బీచ్ లో ఉండగా.. తన పెంపుడు కుక్క ఓ మహిళ వెంట పడి విసిగించిన ప్రవర్తనకు కేటీకి క్షమాపణ చెప్పింది. వారు బీచ్‌లో కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. ఈ సంభాషణ సమయంలో, లూసీ ప్రాణాలను రక్షించే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వేచి ఉందని కేటీ గ్రహించింది. ఆమె దాతల రిజిస్టర్‌కి వెళ్లినట్లు వెల్లడించింది. ఆ తరువాత వారు నంబర్లు మార్చుకున్నారు. లూపస్‌తో బాధపడుతున్న సమయంలో లూసీ కిడ్నీఫెయిల్ అయ్యింది.

"ఆమెకు అన్ని పరీక్షలు జరిగాయి. ఆమె పెంపుడు కుక్క పసిగట్టినట్టుగా కేటీ ఖచ్చితమైన మ్యాచ్ అని తేలింది. ఒక సర్జన్ దీన్ని 22 మిలియన్ల మందిలో ఒక్కరికి ఇలా జరుగుతుందని.. ఇది చాలా అద్భుతమైన, అరుదైన ఘటన" అని లూసీ డైలీ మెయిల్‌తో అన్నారు. ఆమె, ఆమె భాగస్వామి సెనిడ్ ఓవెన్ వీకెండ్ లో 90 మైళ్ల దూరంలో ఉన్న అబెరిస్ట్‌విత్‌కు వారి క్యాంపర్ వ్యాన్‌ను తీసుకెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె ఆరోగ్య కారణాల వల్ల లాంగ్ డ్రైవ్ వెళ్లలేకపోయింది. దీంతో వ్యాన్ తో సహా ఆమె, వారి కుక్కలు దగ్గర్లోని బీచ్‌లో సేదతీరుతున్నాయి.

ఆ సమయంలో "ఇండీ దాదాపు 100 గజాల దూరంలో ఉన్న ఈ మహిళ వద్దకు వెళ్తూనే ఉంది. ఎన్నిసార్లు వెనక్కి పిలుస్తున్నా.. మళ్ళీ.. మళ్లీ వెల్తూనే ఉంది. ఆమె దగ్గర ఏదైనా తినే వస్తువు ఉందేమో అని అందుకే అలా వెడుతుందని అనుకున్నారు. చివరికి లూసీ భర్త సెనిడ్ ఆమెకు తమ కుక్కల ప్రవర్తనకు క్షమాపణ చెప్పడానికి వెళ్ళాడు, ఎందుకంటే డోబర్‌మాన్‌లు కొంచెం భయపెడతాయి. నేను ఆమెను మా బార్బెక్యూకి ఆహ్వానించాను, ఆమె వచ్చింది. ఆమెకు కొంచెం డ్రింక్ ఇచ్చాం. దాంట్లో నాకు ఆమె కొంచెం ఆఫర్ చేసింది.. కానీ నేను డయాలసిస్‌లో ఉన్నందున తాగలేనని సెనిడ్ వివరించాడు. కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పాడు" ఆమె జోడించింది.

కేటీ తన కిడ్నీని దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంతో, ఇద్దరు మహిళలు గతేడాది అక్టోబర్ 3న కార్డిఫ్‌లోని యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్‌కు వెళ్లారు. ఆపరేషన్ విజయవంతమైంది. లూసీ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది మరియు సంతోషంగా, సాధారణ జీవితాన్ని గడుపుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios