Asianet News TeluguAsianet News Telugu

విమానంలో ప్రయాణికుల గొడవ.. వాగ్వాదంలో కిటికీ పగులగొట్టడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. నలుగురు అరెస్ట్ (వీడియో)

ఓ విమానంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత మళ్లీ అదే వర్గానికి చెందిన ప్రయాణికులు గొడవ పడ్డారు. ఈ సమయంలో విమానం కిటికీ పగిలింది. దీంతో మళ్లీ దానిని ల్యాండ్ చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. 

Passengers fight in the plane.. Emergency landing due to window breaking in the fight.. Four arrested (Video)..ISR
Author
First Published Apr 26, 2023, 12:36 PM IST

కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు బయలుదేరిన ఓ విమానంలో ప్రయాణికులు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు బాటిల్ తో విమానం కిటికీని పగులగొట్టాడు. దీంతో అప్రమత్తమైప పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. దీనికి కారణమైన నలుగురు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గంజాయి తరలించాడని భారత సంతతి వ్యక్తిని ఉరితీసిన సింగపూర్.. యూఎన్ వో విజ్ఞప్తి చేసినా పట్టించుకోని ప్రభుత్వం..

విమానంలో ప్రయాణికులు రెండు సార్లు గొడవ పడ్డారు. ఏప్రిల్ 20వ తేదీ ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయిన తరువాత కారిడార్ సమీపంలో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడు తలపై బాటిల్ తో కొట్టాడు. దీంతో నలుగురు వ్యక్తులు విమానం గాలిలో ఉండగానే ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం, తన్నుకోవడం మొదలు పెట్టారు. దీంతో టేకాఫ్ అయిన ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఓ మహిళా ప్రయాణికురాలిపై అభియోగాలు మోపారు.

అనంతరం విమానం మళ్లీ టేకాఫ్ అయ్యింది. కొంత సమయం తరువాత మళ్లీ అదే వర్గం వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు విమానం పద్దం కూడా పగులగొట్టారు. దీంతో పైలెట్ అప్రమత్తం అయ్యాడు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విట్టర్ లో వైరల్ గా మారాయ. అందులో ప్రయాణికులు గొడప పడుతున్న తీరు, వారిని ఆపేందుకు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు, పగిలిన అద్దాలు కనిపిస్తున్నాయి. 

కాగా.. ఆ విమానం నార్తర్న్ టెరిటరీ తూర్పు తీరంలోని గ్రూట్ ఐలాండ్ లోని అలియాంగులాలో ల్యాండ్ అయిన తరువాత ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేశారు. ఓ 23 ఏళ్ల ఓ వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా ఇతరుల భద్రతకు భంగం కలిగించడం, తీవ్రమైన దాడి, ఆస్తులకు నష్టం కలిగించడం, బహిరంగ ప్రదేశంలో క్రమరహితంగా ప్రవర్తించడం వంటి ఉత్తర్వులను ఉల్లంఘించడం వంటి అభియోగాలు మోపారు. అలాగే  23 ఏళ్ల మహిళపై ఆస్తి నష్టం, బహిరంగ ప్రదేశంలో క్రమరహితంగా ప్రవర్తించడం, ఉద్దేశపూర్వకంగా ఇతరుల భద్రతకు భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. మరో 22 ఏళ్ల మరో ప్రయాణికుడిపై వాణిజ్యపరమైన మాదకద్రవ్యాల సరఫరా, మాదకద్రవ్యాలు కలిగి ఉండటం, పోలీసులను అడ్డుకోవడం, క్రమరహిత ప్రవర్తన, నిషేధిత ప్రాంతంలో మద్యం కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపారు.

Follow Us:
Download App:
  • android
  • ios