ఒమెగో వర్చువల్ చాట్ సైట్ : 14 యేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత మూసివేత... కారణం ఏంటంటే..
యూజర్లకు పనికొచ్చే అనేక సానుకూల ఉపయోగాలను కలిగి ఉన్నప్పటికీ, స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయబడిందని బ్రూక్స్ అంగీకరించాడు.
ఒమెగో, 2009లో స్థాపించబడిన వర్చువల్ చాట్ సైట్ అధికారికంగా వీడ్కోలు ప్రకటించింది. ప్రస్తుతం సైట్‌ను యాక్సెస్ చేయాలని చూస్తే.. ఓ ఫొటో మాత్రమే దర్శనమిస్తుంది. ఒమెగో లోగా దానికింద టాక్ టు స్ట్రేంజర్స్ అనే ట్యాగ్ లైన్ ఓ పక్క.. మరో పక్క.. ఒమెగో సమాధి అయినట్లుగా సూచించే ఓ ఏఐ ఫొటో... అందులో సమాధి రాయి మీద ఒమెగో లోగో.. కింద 2009-2023రాసి ఉంది. దీంతో పాటు Omegle వ్యవస్థాపకుడు లీఫ్ కె-బ్రూక్స్ రాసిన ఓ లెటర్ కనిపిస్తుంది.
"ఒమెగోను నడపడం ఇకపై ఆర్థికంగా లేదా సైకలాజికల్ గా సస్టైనబుల్ కాదు" అని కే-బ్రూక్స్ చెప్పుకొచ్చారు. దీనిమీద బ్రూక్స్ రాస్తూ.. ఒమేగో కొత్త వ్యక్తులకు పరిచయ వేదికగా పనిచేసింది. అనుకోకుండా లేదా హఠాత్తుగా కొత్త వ్యక్తులను కలవడానికి ఒక వేదికగా పనిచేసింది, ఇతరులతో కనెక్ట్ కావడం అనే ప్రాథమిక మానవ అవసరాన్ని నెరవేర్చడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది’’ అన్నారు.
సిరియాలో ఇరాన్ మద్దతు దళాలపై అమెరికా దాడి: 9 మంది మృతి
ఒమెగోను వాడే యూజర్స్ భద్రత కోసం అజ్ఞాతంగా ఉండేలా అనానిమిటీ అనే డిఫాల్ట్ ఫీచర్‌గా కూడా రూపొందించబడింది. అయితే దీంతో యూజర్లకు పనికొచ్చే అనేక సానుకూల ఉపయోగాలను కలిగి ఉన్నప్పటికీ, స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయబడిందని బ్రూక్స్ అంగీకరించాడు.
ఈ ప్లాట్‌ఫారమ్ గురించి ఇటీవలి చాలా వార్తలు వచ్చాయి. ఇది ఆన్‌లైన్ ప్రెడేటర్‌లతో, ఎక్కువగా పెడోఫిలీస్‌తో నిండిపోయిందని వీటిల్లో సారాంశం. సైబర్ టిప్ డాట్ సీఏ ప్రకారం, జూన్ 2023 నాటికి సగటున ప్రతి రెండు రోజులకు ఒకటి చొప్పున పిల్లలపై ఆన్‌లైన్ లైంగిక వేధింపులు వచ్చాయని ఒక నివేదిక. అటువంటి దుర్వినియోగాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యతను బ్రూక్స్ నొక్కిచెప్పాడు. ఈ సమస్యలను పరిష్కరించడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలతో కావాల్సిన విస్తృతమైన నియంత్రణ, సహకారాన్ని వివరించాడు.
ఒమెగో ఇతర ఆన్‌లైన్ కమ్యూనికేషన్ సేవలపై ఇటీవలి దాడుల గురించి వ్యవస్థాపకుడు ఆందోళన వ్యక్తం చేశారు, ఈ దాడులు చివరికి ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రయోజనం పొందే వినియోగదారులకు హాని కలిగిస్తాయని వాదించారు. సైట్ మీద విధించే పరిమితులు అన్యాయంగా అమాయక వినియోగదారులను లక్ష్యంగా చేసుకోకూడదనే ఆలోచనను సమర్థించాడు. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వీయ వ్యక్తీకరణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.
ఒమెగో నిర్వహణ, దాని దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒత్తిడి, ఆర్థిక భారాలను పేర్కొంటూ, కె బ్రూక్స్ చివరికి 14 సంవత్సరాల తర్వాత ఈ ప్లాట్‌ఫారమ్ నిర్వహణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.