Asianet News TeluguAsianet News Telugu

సిరియాలో ఇరాన్ మద్దతు దళాలపై అమెరికా దాడి: 9 మంది మృతి


ఇరాన్ మద్దతు దళాలలపై  అమెరికా  వాయుసేన దాడులు నిర్వహిం
ఇరాన్ మద్దతు దళాలపై  అమెరికా  దాడులకు దిగింది.ఈ దాడుల్లో  తొమ్మిది మంది మృతి చెందారు. సిరియాలో  ఈ ఘటన చోటు చేసుకుంది.చింది.

9 dead as US strikes Iran-linked weapons storage site in Syria: Official lns
Author
First Published Nov 9, 2023, 10:44 AM IST


వాషింగ్టన్: అమెరికా సిబ్బందిపై దాడులకు నిరసనగా బుధవారంనాడు తూర్పు సిరియాలోని ఇరాన్ మద్దతు తెలిపే సాయుధ బలగాలపై  అమెరికా  వాయుసేన  దాడులు నిర్వహించింది.ఈ విషయాన్ని  యూఎస్  డిఫెన్స్ సెక్రటరీ  లాయిడ్  ఆస్టిన్ ప్రకటించారు. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ బుధవారంనాడు జరిగిన సమ్మెలో  ఇరాన్ మద్దతుగల గ్రూపులతో  అనుబంధంగా ఉన్న తొమ్మిది మంది మరణించారు.ఇరాన్ మద్దతున్న సాయుధ బలగాలపై  అమెరికా దాడులకు దిగడం ఇది రెండోసారి.  

అమెరికా సిబ్బందిపై దాడులకు ప్రతిస్పందనగా బుధవారంనాడు తూర్పు సిరియాలో ఇరాన్ తో సంబంధం ఉన్న  సాయుధ దళాలపై దాడి చేసినట్టుగా యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.

ఈ ఘటనలో  తొమ్మిది మంది మృతి చెందారు.ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటాన్ని యుద్ధంగా మార్చకుండా  ఇరాన్ సహా దాని మద్దతు దారులను  అణచివేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది.  ఇరాక్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై  ఇరాన్ మద్దతు సాయుధ బలగాలు దాడులకు దిగుతున్నాయి.ఈ దాడులకు ప్రతీకారంగానే  అమెరికా వాయు దాడులకు పూనుకుంది. అమెరికాకు చెందిన బలగాలపై  ఇరాన్ మద్దతు సాయుధ బలగాలు  పదికి పైగా దాడులు చేసినట్టుగా అమెరికా ఆరోపిస్తుంది.

 తమ దళాలపై దాడుల వెనుక ఇరాన్ ఉందని అమెరికా చెబుతుంది.  తమ దళాలపై దాడులు చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చింది. తమ దళాలపై ఇరాన్, ఇరాన్ కు మద్దతుగా ఉన్న సాయుధ దళాలు దాడులను ఆపాలని అమెరికా కోరుతుంది. ఈ దాడులను ఆపాలనే ఉద్దేశ్యంతోనే వాయుసేనతో దాడులు నిర్వహించినట్టుగా  అమెరికా స్పష్టం చేసింది. 

also read:గాజాను రెండుగా విభజించి.. : దాడులను మరింత ఉధృతం చేసిన ఇజ్రాయెల్ సైన్యం..

ఈ ఏడాది అక్టోబర్  26న సిరియాలో తమ దళాలపై  దాడులు జరిగిన విషయాన్ని అమెరికా రక్షణ విభాగం గుర్తు చేస్తుంది.ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా డిఫెన్స్ విభాగం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుండి రాకెట్లు, డ్రోన్లతో  40 కంటే ఎక్కువసార్లు దాడులు జరిగిన విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ప్రస్తావిస్తుంది.గాజాపై ఇజ్రాయిల్  దాడులకు దిగుతుంది. ఈ దాడుల నేపథ్యంలో  సుమారు  10, 500 మంది  మృతి చెందినట్టుగా  సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios