అన్ని టాక్స్ లూ పోను మెక్లీష్ సుమారు 4.8 కోట్లు సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం ఇరవై డాలర్లు అంటే (రూ.1500) పెట్టి  కొన్న లాటరీ కి 6,50,000 డాలర్లు అంటే  4.8 కోట్ల రూపాయలు పొందటంపై మెక్లీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

లాటరీ తగిలితే ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా తోడవుతుంది. ఆరోగ్యం బాగాలేక చికిత్స తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లాటరీ గెలిస్తే సంతోషానికి హద్దులు ఉండవు. అచ్చం ఇటువంటి ఓ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్ లో చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మసాచుసెట్స్ లోని అలెగ్జాండర్ మెక్లీష్ Open Heart Surgery చికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆయనకు తన స్నేహితుడి దగ్గర నుంచి వచ్చిన getwel కార్డులో వన్ మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 7.5 కోట్ల రూపాయల లాటరీ తగిలింది.

మసాచుసెట్స్ రాష్ట్ర Lottery Commission తెలిపిన వివరాల ప్రకారం.. మెక్లీష్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న సమయంలో అతని స్నేహితుడు మూడు Lottery Scratch of Ticket లను తీసుకున్నాడు. అయితే సర్జరీ తర్వాత McLeish వాటిని స్క్రాచ్ చేయగా.. వన్ మిలియన్ డాలర్ల భారీ లాటరీ గెలుచుకున్నాడు.

అన్ని టాక్స్ లూ పోను మెక్లీష్ సుమారు 4.8 కోట్లు సొంతం చేసుకున్నాడు. అయితే కేవలం ఇరవై డాలర్లు అంటే (రూ.1500) పెట్టి కొన్న లాటరీ కి 6,50,000 డాలర్లు అంటే 4.8 కోట్ల రూపాయలు పొందటంపై మెక్లీష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

టిక్ టాక్, ఇన్ స్టాలో టిప్స్.. నెలకు అక్షరాలా రూ.కోటి సంపాదిస్తూ...

ఇదిలా ఉండగా, ఇలాంటి అనుకోని అదృష్టం ఓ హైదరాబాదీకి గత సెప్టెంబర్ లో దక్కింది. 20 రూపాయలు పెట్టి కొన్న వాటర్ బాటిల్ అతన్ని కోటీశ్వరుడిని చేసింది. చాలామంది యేళ్ల తరబడి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడో గానీ అదృష్టం కలిసిరాదు. 

కానీ, ఈ హైదరాబాదీ విషయంలో మాత్రం అలా జరగలేదు. Mahzooz millionaire లాటరీ డ్రా కు కొన్ని గంటల ముందు కొన్న ఓ Water Bottle అతడి జీవితాన్నే మార్చేసింది. ఎంతలా అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసేసింది. దుబాయ్ లో నిర్వహించే మహజూజ్ మిలియనీర్ డ్రాలో తాజాగా హైదరాబాద్ కు చెందిన మీర్ అనే వ్యక్తి ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా వన్ మిలియన్ దిర్హమ్స్ (సుమారు రూ.2 కోట్లు) గెలుచుకున్నాడు. 

ఒమిక్రాన్ య‌మ‌డెంజ‌ర్‌.. ద‌క్షిణాఫ్రికా శాస్త్ర‌వేత్త‌ల కొత్త హెచ్చ‌రిక‌లు

దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. లాటరీ డ్రా నిర్వహించేందుకు ఐదు గంటల ముందు తాను కొనుగోలు చేసిన వాటర్ బాటిల్ తనకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని తెలిపాడు. ఇలా వాటర్ బాటిల్ కొనడం ద్వారా తాను మహజూజ్ లాటరీలో భాగమయ్యానని, అది కాస్తా తన జీవితంలో చూడనన్ని నగదును తెచ్చిపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నాడు.