టిక్ టాక్, ఇన్ స్టాలో టిప్స్.. నెలకు అక్షరాలా రూ.కోటి సంపాదిస్తూ...
కేట్ సరదాగా డాన్స్ చేస్తూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి ఆసక్తికరంగా పాఠాలు చెప్పేవారు. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ తరగతులకు హాజరు అయ్యే వారి సంఖ్య కొద్దిరోజుల్లోనే బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో 2021 ఏప్రిల్ నాటికి నెలకు కోటి రూపాయల ఆదాయం అందుకున్నారు. కేట్ ప్రియుడు సైతం ఉద్యోగాన్ని వదిలి ఆమెకు సాయం చేస్తున్నారు.
కాస్త భిన్నంగా ఆలోచిస్తే ఎన్నో లాభాలుంటాయి. అందరూ వెళ్లే దారిలో కాకుండా.. కొత్త దారుల్లో నడకమొదలుపెడితే అది విజయతీరాలను అందుకునేలా చేస్తుంది. వినూత్నంగా ఆలోచించడం.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను ఫాలో అవ్వడం.. దానికి తగ్గట్టుగా కాస్త ధైర్యం చేసి ముందడుగు వేయడం.. దీనివల్ల ఓ యువతి నెలకు కోటి రూపాయలు సంపాదిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఆమె చేస్తున్నదల్లా సింపుల్ గా online Teaching చేయడం.. కాకపోతే ఆమె చెప్పే విధానం.. సబ్జెక్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. బోరింగ్ సబ్జెక్టును ఇంట్రెస్టింగా చెబుతూ ఆమె తీసుకుంటున్న క్లాసులకు లక్షలాది మంది ఇంప్రెస్ అవుతున్నారు. ఇంకేముంది చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి.. తనకిష్టమైన, తనే Create చేసిన ఈ పనిని ముందుకు తీసుకువెళ్లే పనిలో పడింది. ఇంతకీ విషయం ఏంటంటే..
Microsoft Excel, Google Sheets గురించి చిట్కాలు మెలకువలు చెబుతూ అమెరికా యువతి ఒకరు భారీగా ఆర్జిస్తున్నారు ఈ మేరకు న్యూయార్క్కు చెందిన కేట్ నోర్టన్ అనే 27 ఏళ్ల యువతి Tick tock, Instagram లో ఆన్లైన్ క్లాసులు బోధిస్తూ నెలకు కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తుంది.
Social mediaల్లో ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాస్త బోరింగ్ గా అనిపించే ఎక్సెల్, గూగుల్ స్ప్రెడ్ షీట్ లపై పాఠాలు చెప్పేందుకు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం Kat Norton వదులుకున్నారు. మొదట Ms excel పేరిట ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ లో ఆమె ఖాతాలు ప్రారంభించారు. గతేడాది నవంబర్లో ఆన్లైన్ టీచింగ్ బిజినెస్ మొదలుపెట్టారు.
సరదాగా డాన్స్ చేస్తూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి ఆసక్తికరంగా పాఠాలు చెప్పేవారు. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ తరగతులకు హాజరు అయ్యే వారి సంఖ్య కొద్దిరోజుల్లోనే బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో 2021 ఏప్రిల్ నాటికి నెలకు కోటి రూపాయల ఆదాయం అందుకున్నారు. కేట్ ప్రియుడు సైతం ఉద్యోగాన్ని వదిలి ఆమెకు సాయం చేస్తున్నారు.
నన్ను ఎందుకు పుట్టనిచ్చావ్? తల్లికి వైద్యం చేసిన డాక్టర్‌పై బిడ్డ ఫిర్యాదు.. కోర్టులో కేసు విజయం
ఇద్దరూ కలిసి ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు. ఎక్సెల్, గూగుల్ షీట్స్ పై పూర్తిస్థాయి శిక్షకురాలు గా మాత్రమే కాకుండా... ఇతర ఆన్ లైన్ ప్రొడక్ట్స్, కోర్సులకు సంబంధించి సమాచారాన్ని బోధిస్తూ కేట్ రెండు చేతులా సంపాదిస్తుంది.
ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఏప్రిల్ 2021లో తన మొదటి ఆరు అంకెల సంపాదనకు చేరుకుంది. ప్రస్తుతం నార్టన్ డిజిటల్ నోమాడ్‌గా మారింది. అంటే సంచారజీవి అన్నమాట. తన ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె ప్రతి నెల కొత్త నగరానికి వెళుతుంది.
అక్కడ తన క్లాసులను విస్తరిస్తూముందుకు సాగుతుంది. ఆమె అతి త్వరలో ఏడు అంకెల సంపాదన నెలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చూస్తుంటే అది సాధించినట్టే కనిపిస్తుంది. దీనికి కారణం ఆమె చెప్పే వీడియోలు ఫన్నీగా ఉంటూ, ఆకట్టుకోవడమే. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.