Asianet News TeluguAsianet News Telugu

కదులుతున్న ఒక రైలులో నుంచి.. మరో రైలులోని ప్రయాణికులను బెల్టుతో కొడుతున్న వ్యక్తి...వీడియో వైరల్..

ఎదురుబొదురుగా వస్తున్న ఓ రైలులో ఉన్న ప్రయాణికుడు.. మరో రైలులో ఉన్న వారిని బెల్టుతో కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 

Man Hitting Passengers Of Another Moving Train With Belt, Railways Initiates Action, Video Goes Viral - bsb
Author
First Published Jul 8, 2023, 2:17 PM IST

ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్న మరొక కదులుతున్న రైలులోని ప్రయాణికులపై బెల్ట్‌తో దాడి చేస్తున్న దృశ్యానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ఓ ట్విట్టర్‌ యూజర్ దీన్ని షేర్ చేశాడు. ఈ క్లిప్ బీహార్‌లోని చప్రా జిల్లా నుండి ప్రయాణించే రైలులో చిత్రీకరించబడింది. “ఈ కుర్రాడు వేరే రైలులో డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళని బెల్టుతో కొడుతున్నాడు.

’అలా కొట్టడం వల్ల డోర్ దగ్గర కూర్చున్న వ్యక్తి కూడా రైలులో నుంచి పడిపోవచ్చు. లేదా బెల్టు తగలడం వల్ల మరేదైనా పెద్ద ప్రమాదం కూడా జరగవచ్చు. దయచేసి ఇలాంటి సంఘవిద్రోహ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోండి’ అని దీనికి ఆ యూజర్ హిందీలో క్యాప్షన్‌లో రాశారు.

ఢిల్లీ మెట్రోలో పోర్న్, కిస్సింగ్, ఫైటింగ్ ల తరువాత.. ఇప్పుడిక పోల్ డ్యాన్స్... వైరల్ వీడియో..

వీడియోలో, గుర్తు తెలియని వ్యక్తి పక్కనే ఉన్న ట్రాక్‌పై అపోజిట్ గా వస్తున్న మరొక రైలు డోర్ దగ్గర కూర్చున్న వ్యక్తులను కొట్టడం చూడవచ్చు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు అతను తన చేతిలో లెదర్ బెల్ట్‌తో ప్రజలను అనేకసార్లు కొట్టడం కనిపిస్తుంది. 

ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న ఖచ్చితమైన తేదీ, ప్రదేశం తెలియదు. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌పై రైల్వే అధికారులు స్పందిస్తూ, ఈ విషయంలో చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. "మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు, దీని మీద చర్య తీసుకుంటున్నాం" అని ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక ఖాతా హిందీలో ట్వీట్ చేసింది.

మరోవైపు, వీడియో శుక్రవారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అప్పటి నుండి ఇది 4,15,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.  కామెంట్లలో పలువురు ట్విట్టర్ యూజర్లు ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఓ వ్యక్తి.. ‘అతను మానసిక రోగిలా కనిపిస్తున్నాడు. శిక్షతో పాటు అతనికి తగిన చికిత్స కూడా కావాలి..’ అని వ్యగ్యంగా కామెంట్ చేశాడు. మరొకరు "అతను బెల్టుతో కొడుతున్నాడు. దీని వల్ల తాకినవారికి తీవ్ర గాయం అవుతుంది. అతన్ని అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు రైల్వే అధికారులుచ యూపీ పోలీసుల అఫీషియల్ అకౌంట్లకు ట్యాగ్ చేసి, "వ్యక్తిపై తగిన చర్య తీసుకోవాలని" కోరారు. "సైకోను త్వరగా అరెస్టు చేయాలి. వెంటనే 10,000 కొరడా దెబ్బలు వేయాలి" అని మరొకరు వ్యాఖ్యానించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios