ఢిల్లీ మెట్రోలో పోర్న్, కిస్సింగ్, ఫైటింగ్ ల తరువాత.. ఇప్పుడిక పోల్ డ్యాన్స్... వైరల్ వీడియో..
వ్యాఖ్య విభాగంలో, కొంతమంది వినియోగదారులు పనితీరుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయగా, మరికొందరు వారి ప్రవర్తనను ప్రశ్నించారు.
ఢిల్లీ : మెట్రో రైలు కోచ్‌లలో వీడియోలను రికార్డ్ చేయడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పదేపదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు ఇప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీనికి సంబంధించి అనేక వీడియోలు వెలుగు చూస్తున్నాయి. ఈసారి, పాత బాలీవుడ్ పాటకు ఇద్దరు మహిళలు "పోల్ డ్యాన్స్" చేసిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
హస్ నా జరూరీ హై అనే వినియోగదారు ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. దీనికి "ఢిల్లీ మెట్రోలో పోర్న్, కిస్సింగ్, ఫైటింగ్ ల తర్వాత. లేటెస్ట్ పోల్ డ్యాన్స్" అని క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో.. పర్వీన్ బాబీ, శశి కపూర్ నటించిన 'సుహాగ్' చిత్రంలోని 'మెయిన్ తో బేఘర్ హూన్' పాటకు లిప్ సింక్ చేస్తూ పోల్ చుట్టూ తిరుగుతూ.. డ్యాన్స్ చేశారు. ఈ యువతులు ఎవరో తెలియరాలేదు. ఈ క్లిప్ గురువారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. అప్పటి నుండి ఇది 302,000 కంటే ఎక్కువ వీక్షణలను సేకరించింది.
నాకింకా ముసలితనం రాలేదు.. నేను ఇంకా పని చేయగలను - అజిత్ పవర్ కు కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్
దీనిమీద నెటిజన్లు మండిపడుతున్నారు.. "ఢిల్లీ మెట్రోకు నిజమైన చెక్ అప్ అవసరం, రీల్ తయారీదారులకు ఇది కొత్త లొకేషన్ లాగా ఉంది" అని ఒకరు వ్యాఖ్యానించారు. కనీస మర్యాద మరిచిపోయినప్పుడు ఇలాంటివి వెలుగు చూస్తాయి.. అని మరొకరు కామెంటారు.
"డీఎంఆర్సీ ఇలాంటి వ్యక్తులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది? వారు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవలను కించపరిచారు" అని ఇంకొకరు మండిపడ్డారు. మరొకరు.. డిఎంఆర్‌సి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీసులు, హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అఫీషియల్ అకౌంట్ లను ట్యాగ్ చేసి, “ఇవన్నీ చేయడానికి మెట్రోను తమ ప్రైవేట్ మాన్షన్‌గా భావించే ఇలాంటి వ్యక్తులను దయచేసి ఆపండి. .దయచేసి వీళ్లెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి’’అని కోరారు.
డీఓంఆర్సీ, ఈ సంవత్సరం ప్రారంభంలో, ఢిల్లీ మెట్రో రైళ్లలో వీడియోలను చిత్రీకరించవద్దని టెంప్లెట్లు అంటించింది. మెట్రోలో ప్రయాణించే వారికి ఇబ్బంది కలిగించవద్దు.. అని హిందీలో అందులో హెచ్చరించింది. అయినా ఈ వీడియో చిత్రీకరణలు ఆగడం లేదు.