గతుకుల రోడ్డులో.. బురద గుంతల మధ్య వధువు ఫోటోషూట్.. వైరల్ అవుతున్న వీడియో...

నడిరోడ్డులో ఓ వధువు ఫోటో షూట్ చేసుకుంది. అది కూడా గుంతలు పడి, బురదతో నిండిన రోడ్డు మధ్యలో నడుస్తూ..దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Kerala Bride Walks On Road Full Of Potholes For Photoshoot Viral Video

కేరళ : ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. బ్రైడల్ ఫోటోషూట్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్. అయితే వీటిని కొత్తగా ట్రై చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు నేటి యువత. తమ వెడ్డింగ్ బ్రైడల్ షూట్ కి సామాజిక బాధ్యత అనే టచ్ ఇస్తూ వైరల్ గా మారుతున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ఇంతకీ ఈ వీడియోలో ఏముందీ అంటే.. పెళ్లికి ధరించే సంప్రదాయ ఎర్రటి చీరలో.. ఒంటినిండా నగలు, పూలజడ.. పెళ్లికూతురు గెటప్ లో ఉన్న వధువు.. కేరళలోని ఓ గుంతల రోడ్డులో నడిచి వస్తోంది. ఆమె అలా నడుస్తూ బురదతో నిండిన గోతులను చూపిస్తూ ఫోటోషూట్ చేసింది. ఆమె నడుస్తుంటే ఆ పక్కనే ఓ టూవీలర్ మీద వెడుతున్న వ్యక్తి.. గుంతలకు బండిమీది నుంచి పడకుండా సర్కస్ ఫీట్లు చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఫోటోలు తీస్తున్న ఫోటో గ్రాఫర్ కూడా కనిపిస్తున్నాడు. 

వైరల్ వీడియో : జిమ్ లో వధువు కసరత్తులతో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. అత్తింటివారికి చుక్కలే అంటున్న నెటిజన్లు..

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను Arrow_weddingcompany అనే Instagram హ్యాండిల్ పోస్ట్ చేసింది. వీడియోతో పాటు, “రోడ్డుమధ్యలో పెళ్లి ఫోటోషూట్” అని క్యాప్షన్ రాసింది. ఈ వీడియో సెప్టెంబర్ 11న షేర్ చేశారు. కాగా, ఇప్పటివరకు, ఈ క్లిప్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.3 మిలియన్ల వ్యూస్, 37,0400 లైక్‌లు వచ్చాయి. వధువు సృజనాత్మకత ఇంటర్నెట్ ను ఆకట్టుకుంది. చాలామంది సోషల్ మీడియా యూజర్స్ కేరళ రోడ్ల పరిస్థితులను ఎగతాళి చేశారు. ఒకరు "రోడ్డుపై కాదు చెరువులో" అని రాశారు. మరొకరు, "మంచి రహదారి" అని రాసి ఉంది. "అది ఒక రహదారా? కొన్ని చేప పిల్లల్ని కొని ఆ రోడ్డులో చేపల పెంపకం ప్రారంభించవచ్చు," అని రాసుకొచ్చారు. 

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 30న సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి పెళ్లికూతురిలా ముస్తాబయ్యి.. ఆ గెటప్ లోనే జిమ్ లో కసరత్తులు చేస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకుంది. దీన్ని ఐపీఎస్ ఆఫీసర్ రుపిన్ శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వెంటనే ట్వీట్లు, రీట్వీట్లు.. షేర్స్, లైక్స్ తో దూసుకుపోతోంది ఈ వీడియో. బాహుబలి కోడలు అంటూ.. జమానా మారింది అంటూ కామెంట్ల వరద కొనసాగింది.

ఈ వీడియోను సంయుక్త అనే మరో ట్విట్టర్ యూజర్ షేర్ చేస్తూ.. ఇదేంటీ.. భర్త, అత్తింటివారికి క్లియర్ హెచ్చరికా??? అంటూ సరదా కామెంట్ చేస్తూ పోస్ట్ చేసింది. అంతే దీనిమీద కూడా కామెంట్ల వరద కొనసాగుతోంది. అఫ్ కోర్స్ నెగటివ్ కామెంట్స్ లేకపోతే అది సోషల్ మీడియానే కాదు.. వాటితో పాటు.. సరదాగా ‘అత్తింటివారి పని అయిపోయింది’.. ‘ఇక వారికి చుక్కలే’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఇంతకీ ఈ వీడియో ఎక్కడిదంటే తమిళనాడులోది. తమిళనాడుకు చెందిన ఓ యువతి.. తన పెళ్లికి ముందు ఇలా డిఫరెంట్ గా ఫోటో షూట్ ప్లాన్ చేసింది. దీనికి ఫోటో గ్రాఫర్లు.. వీడియో గ్రాఫర్లు కూడా నవ్వుతూ, సరదాగానే స్పందించారు. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ల కల్చర్లో ఇప్పుడు ఇది ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. మరి దీనిపై వరుడు ఎలా స్పందించాడో.. కాస్త పాతతరం, పట్టింపులు ఎక్కువగా ఉండే అత్తగారు అయితే.. వారెలా స్పందించేవారో.. కానీ ఇప్పటికైతే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios