తొలి అనుభవం ఎప్పుడైనా కొత్తగానే ఉంటుంది. అంది ఎందులోనైనా కావచ్చు. కొంచెం ఊహ వచ్చిన తర్వాత తొలిసారి ట్రైన్ ఎక్కినా, విమానం ఎక్కినా పిల్లలు ఆనందపడిపోతుంటారు. చాలా ఎగ్సైట్ అయిపోతారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా.. అదే అనుభూతి పొందుతున్నాడు.

Also readఅమ్మాయే... అబ్బాయిలా వేషం మార్చి... 50మందిపై అత్యాచారం...

18 నెలల ఈ చిన్నారి తొలిసారి వర్షాన్ని చూశాడు. దీంతో... ఆ వర్షాన్ని ఎంజాయ్ చేశాడు. వర్షంలో తడుచుకుంటూ ముందుకు వెళ్లి.. దాని అనుభూతి పొందాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఆస్ట్రేలియాలో గత మూడు సంవత్సరాలుగా సరైన వర్షం పడలేదు. అప్పుడప్పుడు పడినా... అది కూడా తుప్పరలాంటి వర్షం పడి వెళ్లిపోయేది. పెద్దపాటి వర్షాన్ని చూసి ఆ ప్రాంత వాసులకు మూడేళ్లు పట్టింది. అందులో ఈ చిన్నారి వయసు 18నెలలే కావడంతో... వాడు వర్షాన్ని అనుభూతి పొందిన సందర్భమే లేదు.

 

సడెన్ గా బుధవారం ఒక్కసారిగా పెద్ద వర్షం పడటంతో.. అందరూ ఆనందపడిపోయారు. ఇక ఈ చిన్నారి సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆనందంగా వెళ్లి చిందులువేశాడు. ఈ ఘటనపై ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ... వర్షం పడితే.. పంట వేసుకుందామని తామంతా అనుకున్నామని చెప్పారు. తమ చిన్నారి ఇలా ఆనందంగా వెళ్లి వర్షంలో తడుస్తూ ఆనందపడతాడని ఊహించలేదన్నారు. మరో ఐదు రోజులు వరసగా ఇలానే వర్షం పడితే బాగుండని వారు కోరుకుంటున్నారు.

వీళ్లు మాత్రమే కాదు... మిగిలిన చాలా మంది సామన్య ప్రజలు కూడా ఈ వర్షాన్ని ఆస్వాదించారు. దీనికి సంబంధించి నెట్టింట విపరీతంగా కామెంట్స్, వీడియోస్ పెట్టారు. చాలా కాలం తర్వాత వర్షం పడిందంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.