ఆడపిల్ల పుడితే... ఎక్కడ ఏ మృగాడి కంట పడుతుందే అని చాలా మంది భయపడిపోతున్నారు. ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలా అని భయపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు. అయితే... కేవలం మృగాళ్ల నుంచే కాదు... కొందరు ఆడవాళ్ల నుంచి కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకు ఈ వార్తే ఉదాహరణ.

ఓ యువతి... హ్యాండ్సమ్ కుర్రాడి ముసుగు వేసుకొని దాదాపు 50మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఉత్తర లండన్ కి చెందిన గెమ్మా వాట్స్(21) అనే యువతికి చిన్ననాటి నుంచి పురుష లక్షణాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఆడపిల్లలను చూస్తే త్వరగా ఆకర్షితురాలు అయ్యేది. అయితే... వాళ్లకు దగ్గరవడానికి ఆమె సరికొత్త నాటకం ఆడింది.

Also Read మండపంపై వధువు రాసలీల వీడియో ప్లే చేసిన వరుడు.. వైరల్

తన లుక్ ని కాస్త మార్చేసింది. ఓ అబ్బాయి పేరిట ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ లలో ఖాతాలు తెరిచింది. తన వయసు 16ఏళ్లు అని చెప్పకుండూ... 14ఏళ్ల బాలికలపై కన్నేసేది. ముందుగా వాళ్లతో స్నేహం పేరిట పరిచయం పెంచుకునేది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాటింగ్ చేసేది. వాళ్లు తనను పూర్తిగా నమ్మేశారు అనుకున్న తర్వాత బయట కలుద్దామని ఒత్తిడి తీసుకువచ్చేది.

తాను ఓ యువతి అన్న విషయం ఎవరూ గుర్తు పట్టేలనంత విధంగా మేకోవర్ చేసుకునేది. ఇక ఆమె అందానికి అమ్మాయిలు దాసోహమయ్యేవారు. ఈ క్రమంలో ఒకటి రెండుసార్లు వారిని ప్రత్యక్షంగా కలిసిన తర్వాత.. గెమ్మా వారిపై అత్యాచారానికి పాల్పడేది. ఇలా దాదాపు 50 మంది మైనర్లపై ఆమె అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో బాలికపై అత్యాచారం చేస్తుండగా 2018లో గెమ్మాను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా పోలీస్ మాట్లాడుతూ..ఈ దారుణాలకు ఒడిగట్టినందుకు తాను ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్నారు. బేస్‌బాల్‌ క్యాపుతో జట్టును దాచి.. అబ్బాయిలా వేషం ధరించి బాలికలను అత్యాచారం చేసేది. ఈ క్రమంలో పలు వాయిదాల అనంతరం కోర్టు ఆమెకు శనివారం శిక్షను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా తాను నలుగురిని మాత్రమే అత్యాచారం చేసినట్లు అంగీకరించిందని పేర్కొన్నారు.