హైదరాబాద్ మెట్రోలో మానవీయ ఘటన.. ఆకలితో నకనకలాడిపోతున్న యువతికి ఆ మహిళ ఏం ఇచ్చిందంటే..

మెట్రోలో ఆకలితో ఉన్న తోటి ప్రయాణికురాలికి తన దగ్గరున్న ఆహారం ఇచ్చిందో మహిళ. ఆమె దయార్ద్ర హృదయాన్ని మెచ్చుకుంటూ ఆ ప్రయాణికురాలు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ రాసింది. అదిప్పుడు వైరల్ అవుతోంది. 

humanitarian incident in Hyderabad Metro, What did the woman give to the starving young woman goes viral - bsb

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దీనిగురించి ఓ మహిళ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం రెడిట్ లో రాయగా అది వైరల్ గా మారింది. మనుషులు తోటి మనుషుల అవసరాల మీద ఎంత కరుణతో వ్యవహరిస్తారో కొన్ని సంఘటలను రుజువు చేస్తాయి. అలాంటి ఘటనే ఇది. 

మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు విపరీతమైన ఆకలి వేసింది. తన ఆకలి గురించి తన స్నేహితులకు ఫిర్యాదు చేసింది. అది విన్న ఓ మహిళా ప్రయాణికురాలు తన దగ్గరున్న ఆహారాన్ని ఆమెకు ఇచ్చింది. ఈ విషయాన్నే రెడ్డిట్‌ లో పోస్ట్‌ చేసింది. దీన్ని కొంతమంది మెచ్చుకోగా, మరికొంతమంది మెట్రోలో ఆహారం తినడం నిషిద్ధం కదా.. అలాంటి నిబంధనలకు కట్టుబడి ఉండాలని అన్నారు.

నమ్మించి గొంతుకోయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య.. వాటికి 3 పైసలు కూడా ఇవ్వరు..: కిషన్ రెడ్డి

ప్రూడెంట్-యాక్షన్ 3511 అనే హ్యాండిల్ వినియోగదారు తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు. “నేను మెట్రోలో రాయదుర్గ్ నుండి ఇంటికి వెళ్తున్నాను. నేను ఎంత ఆకలితో ఉన్నానో నా స్నేహితులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించాను. దాని గురించి సరదాగా మాట్లాడుతున్నాం. కూపేలోని ఓ ప్రయాణికుడి బ్యాగ్ లో ఉణ్న జ్యూస్ బాటిల్‌ ను దొంగిలిస్తే ఎలా ఉంటుంది.. అంటూ జోకులు కూడా వేసుకున్నాం. 

ఈ సమయంలో మా పక్కనే కూర్చున్న ఓ దయామయురాలైన మహిళ మా సంభాషణ అంతా విన్నది. మీరు ఆకలితో ఉన్నారా అని అడిగింది. తన దగ్గర పులిహోర ఉందని చెప్పింది, అది లంచ్‌కి చేసింది. కానీ తన బాక్సులో ఇంకా ఉందని.. తినొచ్చని చెప్పింది. మరో బాక్సులో సగం దానిమ్మపండుఉంది. వాటిని ఇవ్వజూపింది. కావాలా అని అడిగింది’ ఆమె చెప్పింది.

తీసుకోవడానికి మొదట ఆమె సంకోచించింది. కానీ దానిమ్మపండ్లను తీసుకొని తిన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే, ఆమెకు ఆహారం ఇచ్చిన రెండు నిమిషాల్లో ఆ మహిళ దిగే స్టాప్ వచ్చింది. దిగడానికి సీటులోంచి లేచిన ఆమె.. దానిమ్మ గింజల బాక్సు తన దగ్గరే ఉంచుకోమని చెప్పింది. దీనిమీద పోస్ట్ చేసిన యువతి మాట్లాడుతూ.. ‘మన మహిళలకు బాక్సులు ఎంత ముఖ్యమో నాకు తెలుసు’ అంటూ చమత్కారం చేస్తూ.. ‘అందుకే నేను గుప్పెట నిండా దానిమ్మగింజలు తీసుకుని బాక్సు ఆమెకు ఇచ్చేశాను’ అని ముగించింది. 

బాక్సును ఆమెకు తిరిగిచ్చేసి.. కృతజ్ఞతలు తెలిపానని చెప్పింది. ఇక పోస్ట్‌ను ముగిస్తూ, ఆ మహిళ "చాలా మంచిది" అని.. ఆమె చేసిన పని నాకు ఎంతో నచ్చిందని తెలిపింది. “మనమందరం ఇలాంటి దయతో కూడిన యాదృచ్ఛిక చర్యలు చేస్తామని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి పనులు మానవత్వంపై మన ఆశను పెంచుతాయి” అని చెప్పుకొచ్చింది. 

నిన్న షేర్ చేసినప్పటి నుండి, ఆమె పోస్ట్‌కి 99 శాతం కామెంట్లు వచ్చాయి. చాలా మంది దయ ఆమె చర్యను ప్రశంసించినప్పటికీ, కొందరు ఆ మహిళ మెట్రో నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఎత్తి చూపారు. మరొకరు ఇలాంటి మరిన్ని పోస్ట్‌లు చదవాలి అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios