హృదయవిదారకం : కొడుకు కాలేజీ ఫీజు కట్డే డబ్బుల్లేక, నష్ట పరిహారం కోసం.. బస్సు కింద పడ్డ మాతృమూర్తి... (వీడియో)

తమిళనాడులోని సేలంలో 45 ఏళ్ల మహిళ కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకు బస్సు కింద పడి మరణించింది. యాక్సిడెంట్ తో చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని భావించింది. 

Heartbreaking : Mother falls under bus for compensation to pay her son's college fees, tamilnadu - bsb

తమిళనాడు : కొన్ని కథనాలు విన్నప్పుడు మనసు భారమవుతుంది. ఆ పరిస్థితులు కలిచి వేస్తాయి. అలాంటి హృదయవిదారకమైన ఘటనే ఇది కూడా. తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. 

కొడుకు కాలేజీ ఫీజు కట్టలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఓ మహిళ విషాదకరమైన నిర్ణయం తీసుకుంది. తాను చనిపోయినా.. తన కొడుకు చదువు సాగితే చాలనుకుంది. కదులుతున్న బస్సు ముందుకు దూసి చనిపోయింది. ఆ మహిళ సేలంలోని కలెక్టర్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. 

కోడిరక్తాన్ని వాడి.. వ్యాపారవేత్తపై తప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు.. రూ.3 కోట్లు దోపిడీ.. చివరికి...

తన కుమారుడి భవిష్యత్తు కోసం తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందాలనుకుని కదులుతున్న బస్సు ముందు దూకింది. జూన్ 28న అతివేగంగా వెళ్తున్న బస్సు ఢీకొనడంతో పాపాతి (45) అనే మహిళ మరణించారు. 

బస్సు కింద పడి మరణించిన వారికి ప్రభుత్వం నుండి నష్ట పరిహారం వస్తుందని.. ఆమెను ఎవరో తప్పుదోవ పట్టించడంతో ఈ దారుణమైన చర్యకు పాల్పడింది. 

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, అంతకుముందు అదే రోజు, పాపాతి బస్సు ముందు దూకడానికి మొదటిసారి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. కొద్దిసేపటి తర్వాత, ఆమె రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు చేసి..  మరొక బస్సు ముందు దూకింది. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ సారి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక పాపాతి డిప్రెషన్‌ లో ఉందని సమాచారం. రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని ఎవరో చెప్పి ఆమెను తప్పుదోవ పట్టించారు. పాపాతి భర్త నుంచి విడిపోయింది.గత 15 ఏళ్లుగా పాపాతి తన పిల్లలను ఒంటరిగా పెంచుతోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios