Asianet News TeluguAsianet News Telugu

వైరల్ : ట్రైన్ లో అమ్మాయిల హాట్ హాట్ డ్యాన్స్ లు.. నెటిజన్లు ఏమంటున్నారంటే...

కొంతమంది అమ్మాయిలు కదులుతున్న ట్రైన్ లో ఓ  సూపర్ హిట్ సాంగ్ కు హాట్ హాట్ మూమెంట్స్ తో డాన్స్ రీల్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిమీద నెటిజన్లు మండిపడుతున్నారు. 

Girls Hot Dance In Moving Train, Video Goes Viral - bsb
Author
First Published May 6, 2023, 12:56 PM IST

సోషల్ మీడియాలో వైరల్  అవ్వడానికి దేనికైనా తెగించడానికి వెనుకాడడం లేదు నేటి యువత. ఓవర్ నైట్ పాపులర్ అవ్వాలని.. వ్యూస్, లైక్స్ తో దూసుకుపోవాలని.. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బుర్రలో తోచిన దానికి వీడియోతో రూపం ఇస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. పాపులారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందని.. తోటివారికి అసౌకర్యం కలుగుతుందని కూడా ఆలోచించడం లేదు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

వారు అనుకున్న లక్ష్యం నెరవేరింది. కానీ, దీని మీద.. నెగటివ్ ట్రోలింగ్ ఎక్కువైంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే కొందరు అమ్మాయిలు నడుస్తున్న ట్రైన్ లో.. హాట్ హాట్ గా డాన్స్లు చేస్తూ.. ఓ వీడియోను రూపొందించారు. ఆ తరువాత దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో వారు అనుకున్నట్టుగానే వైరల్ గా మారింది కానీ.. అదేమైనా గర్ల్స్ హాస్టల్ అనుకున్నారా అంటూ విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.

'ఖర్గే కుటుంబాన్ని హతమార్చేందుకు పన్నాగం':కాంగ్రెస్ సంచలన ఆరోపణ

ఈ వీడియో వైదేహిహహ అనే ట్విట్టర్ హ్యాండిల్ లో  మొదట షేర్ అయింది. కదులుతున్న రైల్లో ఓ సూపర్ హిట్ సాంగ్ కు అమ్మాయిలు ఈ వీడియోలో డాన్స్ చేస్తూ కనిపించారు. మొదట వేరువేరు బెర్తులపై ఉన్న ఇద్దరమ్మాయిలు.. శరీరాన్ని మొత్తం తిప్పుతూ హాట్ మూమెంట్స్ చేశారు.. ఆ తర్వాత మరి కొంతమంది అమ్మాయిలు.. కింది బెర్తుల మీద డ్యాన్సులు చేస్తూ కనిపించారు. 

దీనికోసం వీరంతా రైల్ కోచ్ లో గందరగోళం సృష్టించారని.. సదరు ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. అంతేకాదు.. ఇలాంటి వారితో కలిసి ట్రైన్ లో ప్రయాణించడం అంటే.. వారి ముందు కూర్చుని తినడం కూడా కష్టమే అవుతుంది’ అంటూ కామెంట్ చేశారు. 

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో దాదాపు  2.94 లక్షల వరకు వ్యూస్ దక్కించుకుంది. వారనుకున్నట్టే బాగా వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన చాలామంది.. విమర్శలు చేస్తుండగా…కొంతమంది ప్రశంసిస్తుండడం కూడా చూడొచ్చు. ముందు మెట్రోలో ఈ పైత్యాన్ని చూపించారు.. ఇప్పుడు ట్రైన్లను కూడా వదలడం లేదు..  వీళ్ళు ఇతరుల గురించి పట్టించుకోరు,  రైల్వే శాఖ ఇలాంటి వారి మీద ఏ చర్యలు తీసుకోదా..  అంటూ విరుచుకుపడుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios