Asianet News TeluguAsianet News Telugu

'ఖర్గే కుటుంబాన్ని హతమార్చేందుకు పన్నాగం':కాంగ్రెస్ సంచలన ఆరోపణ 

కర్ణాటకలో ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబాన్ని హతమార్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేస్తోంది.

Congress BIG allegation on BJP hatching plot to murder Mallikarjun Kharge KRJ
Author
First Published May 6, 2023, 12:31 PM IST

బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. అన్ని రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా బీజేపీపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అంటోంది. బీజేపీ నేతలు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా  ఈ ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబ సభ్యులను హతమార్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా చంపే కుట్ర తెరపైకి వస్తోందని సూర్జేవాలా అన్నారు. కర్ణాటకలో రాజ్యాంగాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. మల్లికార్జున్ ఖర్గేను చంపేయాలని బీజేపీ తన స్థాయిని దిగజారి రాజకీయాలు చేస్తుందని, బీజేపీని కర్నాటక ప్రజలు తిరస్కరించారని అన్నారు. 

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ వాతావరణం తమకు వ్యతిరేకంగా ఉందని తెలిసిందని సూర్జేవాలా అన్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను, ఆయన కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నాడు. చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి వాయిస్‌గా చెబుతున్న ఆడియో క్లిప్‌ను కూడా ఆయన వినిపించారు. 

కాన్ఫరెన్స్‌లో సుర్జేవాలా ఆడియో క్లిప్‌ను ప్లే చేసి, చిత్తాపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మణికాంత్ రాథోడ్ ఖర్గేపై అనుచిత పదజాలం ఉపయోగించారని పేర్కొన్నారు. అలాగే ఖర్గే , అతని కుటుంబాన్ని చంపడం గురించి మాట్లాడటం విన్నాను. దీనిపై ప్రధాని మౌనంగా ఉంటారని నాకు తెలుసు.. దీనిపై కర్నాటక పోలీసులు, ఎన్నికల సంఘం కూడా మౌనంగానే ఉంటాయని, అయితే కర్ణాటక ప్రజలు మాత్రం మౌనంగా ఉండరని, తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios