35యేళ్ల తరువాత కలుసుకున్న ప్రేమజంట.. 65యేళ్ల వయసులో ఒక్కటయ్యింది...

ఇద్దరి వయస్సూ 65 సంవత్సరాలు. ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ. కానీ అనుకోనం పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయస్సులో మరొకరితో పెళ్లి అయిపోయింది. ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు.

Elderly love couple gets married at the age of 65 in mandya, karnataka

కర్ణాటక : ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిమీద పుడుతుందో చెప్పడం కష్టం. ఒక్కసారి ఒకరిమీద ప్రేమ కలిగిందంటే జీవితకాలానికి పోదు. ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా... ప్రేమికులు ప్రేమను గెలిపించుకోవాలనే చూస్తారు. అలా కొంతమంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకుని, పెళ్లితో జీవిత ప్రయాణానికి సిద్ధపడగా.. మరికొంత మంది విఫల ప్రేమతో జీవితంలో సర్దుకుపోతారు.

అయితే, ఇంకొంతమంది కాస్త లేటయినా తమ ప్రేమను గెలిపించుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారతారు. ఈ జంట ఈ కోవలోకే వస్తుంది. ఆరు దశాబ్దాలు దాటిన క్రమంలో తమ ప్రేమకు కొత్త చిగురులు తొడిగారు. పెళ్లి అనే బంధంతో ఒక్కటై.. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. 

ప్రేమ ఎంత బలీయమైనదో చెప్పడానికి వారిద్దరి పెళ్లే నిదర్శనం.. ఇద్దరి వయస్సూ 65 సంవత్సరాలు. ఒకరంటే మరొకరికి గాఢమైన love. కానీ అనుకోనం పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయస్సులో మరొకరితో marriage అయిపోయింది. ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు.

పాకిస్తాన్ ప్రభుత్వానికి అవమానం.. ఇమ్రాన్ ఖాన్‌పై ఎంబసీ ట్రోలింగ్.. ‘మీరు చెప్పే నూతన పాకిస్తాన్ ఇదేనా?’

కొంత కాలానికి ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. అప్పటినుంచి ఇద్దరూ తమ old memoriesని నెమరువేసుకుంటూ వేర్వేరుగానే ఉంటూ వచ్చారు. చివరకు సమాజాన్ని, కట్టుబాట్లు కాదని 65 యేళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు. గురువారం కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటెలో ఈ పెళ్లి జరిగింది. 

మేలుకోటె చెలువనారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో మైసూరాలోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ (ఇద్దరికీ 65యేళ్లే) శాస్త్రోక్తంగా పెళ్ల చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపించారు. ఇప్పుడీ లేటు వయసు పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్  అవుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios