Asianet News TeluguAsianet News Telugu

పాముకు సీపీఆర్ చేసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

ఓ పోలీస్ పాముకు సీపీఆర్ చేసి బతికించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Constable who performed CPR to the snake video went viral in madhyapradesh - bsb
Author
First Published Oct 26, 2023, 1:01 PM IST

భోపాల్ : మధ్యప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ కానిస్టేబుల్ పాముకు సీపీఆర్ ఇవ్వడానికి ప్రయత్నించే వైరల్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. మీరు చదివింది నిజమే.. కానిస్టేబుల్ పాముకు సీపీఆర్ చేశాడు. ఆ పాము క్రిమిసంహారక మందు కలిపిన నీటిని తాగి, అపస్మారక స్థితిలో కదలలేకపోతోంది. ఆ పాముని బతికించడానికి ఆ పోలీసు పాము నోట్లో నోరు పెట్టి గాలిని ఊదుతూ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించాడు. 

దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. చాలా మంది అతను చేసిన పనికి పోలీసులను ప్రశంసించారు. అయితే, ఇలా పాముకు సీపీఆర్ చేయడంలో కొన్ని అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. ఒక పశువైద్యుడు ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ, పాముని సీపీఆర్ వల్ల బతికించలేమని, అది అలా ఉపయోగపడదని అది స్వయంగా స్పృహలోకి వచ్చి ఉండవచ్చునని చెప్పారు.

ఫొరెక్స్ ఉల్లంఘన కేసు : అశోక్ గెహ్లాట్ కుమారుడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు..

వైరల్ అవుతున్న వీడియో మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో వెలుగు చూసింది. అక్కడి ఒక నివాస కాలనీలోని పైపులైన్‌లోకి విషం లేని పాము ప్రవేశించింది. పైపు లోపల నుండి దానిని తొలగించడానికి నివాసితులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, వారు పైపుపై పురుగుమందు కలిపిన నీటిని పోశారు. దీంతో పాము బయటకు వచ్చింది. ఏం చేయాలో తెలియక స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు.

కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి చేరుకున్నాడు. అతను స్నేక్ క్యాచర్ కూడా. ఘటనా స్థలానికి చేరుకున్న అతుల్ శర్మ పామును గుర్తించారు. మిస్టర్ శర్మ పామును నిశితంగా పరిశీలిస్తూ, అది ఊపిరి పీల్చుకుంటుందో లేదో తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పాములో చలనం లేకపోవడంతో అతను పాము నోటిలోకి గాలి ఊదడం ప్రారంభించాడు. అతని చుట్టూ గుమిగూడిన వ్యక్తులు క్రిమిసంహారక మందుతో తడిసిన పాము శరీరాన్ని కడగమని కోరడంతో ఆ పోలీసు అధికారి పాము మీద శుభ్రమైన నీటిని చల్లాడు. 

కొద్దిసేపటికే, పాములో చలనం కనిపించింది. అది కదలడం ప్రారంభించింది. గత 15 ఏళ్లలో తాను 500 పాములను రక్షించినట్లు శర్మ పేర్కొన్నారు. అతను దీన్ని ఎక్కడ నేర్చుకున్నాడు అని అడిగినప్పుడు,  డిస్కవరీ ఛానెల్‌ని ఎక్కువగా చూసి, అనుసరిస్తున్నానని చెప్పుకొచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios