ఫొరెక్స్ ఉల్లంఘన కేసు : అశోక్ గెహ్లాట్ కుమారుడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు..

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ కు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఫెమా కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది.

Forex Violation Case : Enforcement Directorate Summons Ashok Gehlot's Son - bsb

రాజస్థాన్ : విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది. గెహ్లాట్ కుమారుడికి ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా), 1999లో అక్టోబర్ 27న జైపూర్‌లో సమన్లు ​​అందాయని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో ముంబైకి చెందిన ట్రైటన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై మనీలాండరింగ్ కేసులో ఫెమా కింద జైపూర్, ఉదయ్‌పూర్, ముంబై, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోదాలు నిర్వహించింది.

మూడేళ్ల బాలికపై 40యేళ్ల వ్యక్తి అత్యాచారం... తాతయ్యతో కలిసి దసరా వేడుకలు చూడడానికి వెడితే దారుణం..

రతన్ కాంత్ శర్మగా గుర్తించబడిన సంస్థ డైరెక్టర్, కార్ రెంటల్ సర్వీస్‌లో వైభవ్ గెహ్లాట్ వ్యాపార భాగస్వామి. వైభవ్ గెహ్లాట్ మారిషస్‌కు చెందిన 'శివ్‌నార్ హోల్డింగ్స్' అనే సంస్థ నుండి అక్రమ నిధులను మళ్లించారని 2015లో, జైపూర్‌లోని ఇద్దరు నివాసితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇది షెల్ కంపెనీగా అనుమానించారు.

2011లో 2,500 హోటల్‌ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మారిషస్‌కు చెందిన సంస్థ నుంచి ట్రిటన్ హోటల్స్‌కు నిధులు మళ్లించబడ్డాయని కూడా నివాసితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షేర్లు ఒక్కొక్కటి రూ. 39,900కి కొనుగోలు చేశారు. కానీ ఒక్కో షేరు అసలు ధర రూ. 100 మాత్రమే.

శివనార్ హోల్డింగ్స్ 2006లో సృష్టించారని, దీన్ని కేవలం బ్లాక్ మనీని మేనేజ్ చేయడానికే అని ఫిర్యాదుదారులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తులో, ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తూ, శివనార్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుండి భారీ ప్రీమియంతో ట్రిటన్ హోటల్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) స్వీకరించినట్లు గుర్తించింది. ట్రిటాన్‌ గ్రూప్‌ హవాలా లావాదేవీల్లో సీమాంతర చిక్కులు తెచ్చుకున్నట్లు విచారణలో తేలింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios