పెళ్లిలో వధువును ముద్దాడిన వరుడు.. షాక్ అయిన అతిథులు.. వీడియో వైరల్...
తమ చుట్టూ మనుషులు, కెమెరాలు ఉన్న విషయం మర్చిపోయి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు అన్నీ పెళ్లిళ్లో ఇలాంటివి కామన్ అయిపోయాయని మద్దతిస్తుంటే.. మరికొందరు ఏంటి ఈ దారుణం.. పెళ్లి అయ్యేవరకు కూడా ఆగలేరా.. పద్ధతులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు... అంటూ ఫైర్ అవుతున్నారు.
ఒకప్పటి కాలంలో పెళ్లి అయ్యేవరకు వధువు, వరుడికి అసలు పరిచయం ఉండేది కాదు. పెళ్లి మండపంలోనే ఒకరినొకరు చూసుకునే పద్ధతులు ఉండేవి. కానీ కాలం మారింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలతో పాటు లవ్ మ్యారేజ్, పెళ్లికి ముందే డేటింగ్ లు, లివింగ్ ఇన్ రిలేషన్లు పుట్టుకొచ్చాయి. ఎన్ని మారినా పెళ్లి జరిపించే పద్ధతులు మాత్రం మారలేదు. ఎవరి సంప్రదాయాలు, పద్ధతులకు అనుగుణంగా వారు పెళ్ళిళ్ళు జరిపిస్తున్నారు.
తాజాగా హిందూ ఆచారం ప్రకారం జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు వధువుని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోలో పెళ్లి తంతు ముగించిన తర్వాత వధువుని ముద్దు పెట్టుకోవాలని మండపం వద్ద ఉన్న అతిథులు వరుడిని కోరారు. దీంతో పెళ్లి వేదిక వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నప్పటికీ సిగ్గుపడకుండా వరుడు, పెళ్లి కూతురు ముఖాన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టాడు. వధవు కూడా వరుడు వద్దకు జరిగి అతని భుజంపై చేతులు వేసి కిస్ చేసింది.
తమ చుట్టూ మనుషులు, కెమెరాలు ఉన్న విషయం మర్చిపోయి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు అన్నీ పెళ్లిళ్లో ఇలాంటివి కామన్ అయిపోయాయని మద్దతిస్తుంటే.. మరికొందరు ఏంటి ఈ దారుణం.. పెళ్లి అయ్యేవరకు కూడా ఆగలేరా.. పద్ధతులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
పన్నెండేళ్ల క్రితం చనిపోయిన భర్త.. మళ్లీ పెళ్లి చేసుకున్న భార్య.. హఠాత్తుగా తిరిగిరావడంతో...
అమెరికాలోనూ ఇలాంటిదే ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే అందులో ముద్దుపెట్టుకోవడం కాదు గానీ.. మాస్క్ ముచ్చట ఉంది. Floridaలోని ఓ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్, కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించిన ప్రయాణికులందరూ విమానంలోకి ఎక్కేసారు. ప్రతి ఒక్కరు నిబంధనలు Kovid Terms పాటిస్తున్నారా? మాస్కులు ధరించారా? అని సిబ్బంది చెక్ చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి మహిళలు ధరించే లో దుస్తులను మాస్క్ లా ధరించాడని తెలిసి..షాక్ కు గురయ్యారు. అలా ఎందుకు చేశారని వారు ప్రశ్నిస్తే.. దీనికి అతడు చెప్పిన సమాధానం విని కంగు తిన్నారు.
అమెరికా ఫ్లోరిడా లోని పోర్ట్ లౌడెర్ డేల్ విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి Women's lingerie(థోంగ్)ను మాస్క్ గా ధరించి తన సీట్లో కూర్చున్నాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది దాన్ని తొలగించి మాస్కు ధరించాలి అని కోరారు. అందుకు ఆడమ్ జైన్ ససేమిరా అన్నాడు. విమాన సిబ్బందికి ఆడమ్ కి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తరువాత Flight crew అతనిని విమానంలో నుంచి దింపేశారు.
అయితే, ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఆడమ్ జేన్ చర్యపై ఎయిర్లైన్స్ సంస్థ చర్యలు తీసుకుంది. మాస్కు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ అతడిపై నిషేధం విధించింది. ఈ అంశంపై సదరు ప్రయాణికుడు మాట్లాడుతూ... విమానంలో తినేప్పుడు, తాగేప్పుడు కూడా మాస్కును ధరించాలని సిబ్బంది సూచిస్తున్నారని.. దానికి నిరసనగా తాను ఈ పని చేసినట్లు పేర్కొన్నాడు.
‘దీనిపై నిరసన తెలిపేందుకు ఇదే ఉత్తమ మార్గంగా భావించా’ అని జేన్ పేర్కొన్నాడు. గతంలో ఓ విమానంలో తాను ఇలాగే ప్రయాణించానని, అది మాస్కులా పనిచేస్తుందని సిబ్బంది తనను ఏమీ అనలేదని చెప్పడం గమనార్హం.