పన్నెండేళ్ల క్రితం చనిపోయిన భర్త.. మళ్లీ పెళ్లి చేసుకున్న భార్య.. హఠాత్తుగా తిరిగిరావడంతో...

చనిపోయాడనుకున్న సదరు వ్యక్తి బతికే ఉన్నాడని.. అనూహ్యంగా అతడి ఆచూకీ తెలిసింది. బీహార్ లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖిలాఫత్ పుర్ గ్రామ నివాసి ఛావీ ముశాహర్. పన్నెండేళ్ళ క్రితం అదృశ్యం కాగా,  ఇప్పుడు అతను పాకిస్తాన్ లోని ఓ జైలులో బందీగా ఉన్నాడనే వార్త తెలియడంతో తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.

Wife remarries after husband dies, after 12 years located him in pakistan jail

బీహార్ : కనిపించకుండా పోయిన వ్యక్తులు, అదృశ్యమైనవారు, చనిపోయారనుకుని ఆశలు వదులుకున్న వ్యక్తులు తిరిగి వచ్చిన ఘటనలు అక్కడక్కడా.. అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. అయితే సదరు వ్యక్తి ఎలా అదృశ్యమయ్యాడో.. ఎందుకు ఇన్నేళ్లపాటు అజ్జాతంలో ఉన్నాడో తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే. 

పన్నెండేళ్ల క్రితం అతను ఇంటి నుంచి miss అయ్యాడు. చాలా రోజులపాటు అతని గురించి family members ఎక్కడెక్కడో వెతికారు. కానీ అతని జాడ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతను చనిపోయాడని అనుకున్నారు. దీంతో అతనికి ఖర్మకాండలు కూడా పూర్తి చేశారు. కనిపించకుండా పోయే నాటికే అతనికి పెళ్లై, భార్య కూడా ఉంది. భర్త కనిపించకుండా పోవడం, ఖర్మకాండలు కూడా చేయడంతో అతను చనిపోయాడని ఆమె కూడా నమ్మింది. ఆ తరువాత రెండేళ్లకు wife మళ్లీ marriage చేసుకుంది.

ఆ తరువాతే ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయాడనుకున్న సదరు వ్యక్తి బతికే ఉన్నాడని.. అనూహ్యంగా అతడి ఆచూకీ తెలిసింది. బీహార్ లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖిలాఫత్ పుర్ గ్రామ నివాసి ఛావీ ముశాహర్. పన్నెండేళ్ళ క్రితం అదృశ్యం కాగా,  ఇప్పుడు అతను పాకిస్తాన్ లోని ఓ జైలులో బందీగా ఉన్నాడనే వార్త తెలియడంతో తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.

ఇంతకూ ఈ విషయం ఎలా తెలిసిందంటే..  పాకిస్తాన్ జైలులో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించాలంటే భారత విదేశాంగ శాఖ నుంచి ముఫాసిల్ ఠాణాకు లేఖ అందింది. పోలీసులు ఖిలాఫత్ పుర్ దళితవాడకు చేరుకొని ఊరంతా ఆరా తీశారు. అది పన్నెండేళ్ళ క్రితం అదృశ్యమైన ఛావీ ముశాహర్ చిత్రమని కుటుంబ సభ్యులు గుర్తించారు.  తన కుమారుడిని వెంటనే తీసుకురావాలని ఛావీ తల్లి ప్రభుత్వాన్ని కోరుతోంది. 

స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఇలా జరగలేదు.. ఎన్నికల అధికారులను పీఎంవో ఆదేశించడమా?.. కాంగ్రెస్ ధ్వజం

ఇదిలా ఉండగా, ముంబయిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నోరు లేని మూగ జీవాలు ఆకలి దప్పికలను తీర్చడం మంచిదే.  కానీ, Mumbaiలోని ఓ మహిళకు మాత్రం ఇందుకు భిన్నమైన అనుభవం ఎదురైంది. భిన్నం అని కాదు.. షాక్ తినే పరిణామం ఎదురైంది. వీధి కుక్క(Stray Dogs)లకు ఆహారం పెడుతున్నదని ఏకంగా రూ. 8 లక్షల జరిమానా(Fine) పడింది. ఆమె నవీ ముంబయిలోని ఎన్‌ఆర్ఐ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. ఆ కాంప్లెక్స్‌లో అప్పుడప్పుడు వీధి కుక్కలు కనిపించేవి. అవి ఆకలితో తచ్చాడుతున్నట్టుగా ఆమెకు కనిపించేవి. అందుకే వీలు చిక్కినప్పుడల్లా వాటికి ఆమె ఆహారం పెడుతూ వస్తున్నది. 

అయితే, ఈ విషయం మాత్రం ఆ కాంప్లెక్స్ వాసులకు గిట్టలేదు. అందుకే ఆ రెసిడెన్షియల్ సొసైటీ ఆమెపై ఫైన్ విధించడానికి సిద్ధమైంది. ఆ ఎన్‌ఆర్ఐ కాంప్లెక్స్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆమెకు ఫైన్ వేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆమె ఎప్పుడు ఆ కాంప్లెక్స్ ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టినా పని గట్టుకుని చూస్తూ నోట్ చేసుకోవాలని వాచ్‌మెన్‌కు ఆ కమిటీ పురమాయించింది. ఆమె ఎప్పుడు వీధి కుక్కలకు ఆహారం పెట్టినా ఆ వాచ్‌మెన్ నోట్ చేసుకునే వాడు. కమిటీ నిర్ణయం మేరకు ఆమె వీధి కుక్కలకు ఆహారం పెట్టిన ప్రతి సారీ ఆమెకు రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు. వీటిని లిట్టరింగ్ చార్జీగా ఆమె నుంచి వసూలు చేశారు. ఇప్పుడు ఆమె పేరు మీద మొత్తం ఫైన్ రూ. 8 లక్షలకు చేరిందని అన్షు సింగ్ వివరించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios