తల్లి గొరిల్లాపై మరో గొరిల్లా దాడి చేస్తుండగా.. తల్లిని కాపాడటానికి పిల్ల గొరిల్లా ప్రయత్నం చేసింది. ఫైటింగ్ మధ్యలోకి దూకేసింది. ఈ వీడియో వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టైనా బిడ్డను ఆపద నుంచి కాపాడుకుంటుంది. పిల్లలు కూడా అంతే. తల్లికి ముప్పు ఉన్నప్పుడు పిల్లలు కూడా పోరుకు దిగుతారు. ఈ సహజాతాలు కేవలం మనుషలకే కాదు జంతువులకూ ఉంటాయి. గొరిల్లా తల్లీ బిడ్డలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. తల్లి గొరిల్లాను మరో గొరిల్లా దాడి చేస్తుండగా పిల్ల గొరిల్లా వెంటనే అక్కడికి వెళ్లింది. ఆ ఫైటింగ్ మధ్యలోకి దూరింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. తొలుత ఈ వీడియోను రెడ్డిట్‌లో షేర్ చేశారు.
గొరిల్లాలు కొట్లాడుకోవడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇది చూడగానే దెబ్బలు తింటున్న తల్లిని కాపాడుకోవడానికి పిల్ల గొరిల్లా సాహసం చేసింది. ఆ పోరు మధ్యలోకి వెళ్లి తల్లిని కాపాడుకునే ప్రయత్నం చేసింది.
Also Read: గేదె సమయస్ఫూర్తి.. సింహాల దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది.. వైరల్ వీడియో ఇదే
తల్లి బిడ్డల ప్రేమ అంటూ ఓ యూజర్ ఈ వీడియో కింద కామెంట్ చేశాడు. మరొకరు ఒక వివరమైన కామెంట్ రాశాడు. ఆ వీడియోను స్లో చేసి జూమ్ చేసి, మళ్లీ మళ్లీ చూడగా తనకు ఒక విషయం అర్థమైందని తెలిపాడు. ఆడ గొరిల్లా నుంచి ఏదో తినే వస్తువు తీసుకునే ప్రయత్నం చేసిందని అర్థమైందని వివరించాడు. ఆమె చేతిలో నుంచి కొంచెం లాక్కుని పరుగు తీశాడని తెలుస్తుందని పేర్కొన్నాడు.
