సారాంశం

నీరు తాగడానికి నది వద్దకు వచ్చిన ఒంటరి గేదెను చూసి కొన్ని సింహాలు దాని చుట్టూ మోహరించాయి. అదును చూసి దాడి చేయడానికి ప్రయత్నాలు చేశాయి. కానీ, గేదె వెనక్కి తిరిగి వాటిపైకి వెళ్లింది. దీంతో సింహాలు కొంత వెనక్కి తగ్గాయి. అనంతరం, ఆ గేదె మొసళ్లున్న ఆ నదిలోకి వెళ్లి సింహాల దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది.
 

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతున్నది. బలవంతులదే రాజ్యం అనే జంతుసామ్రాజ్యంలో అక్కడ నివసించే జీవి నిత్యం సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. అయితే, ఎప్పుడూ బలవంతులదే గెలుపవ్వదు. సమయస్ఫూర్తితో మెలిగితే వేటాడే జంతువుల నుంచీ సాధు జంతువు తప్పించుకోగలదని తాజాగా వైరల్ అవుతున్న వీడియో వెల్లడిస్తున్నది. నదిలో నీరు తాగడానికి వచ్చిన గేదెను అన్ని వైపుల నుంచి సింహాలు మోహరించాయి. అదును చూసి వేటు వేయాలని చూస్తుండగా.. గేదె వాటి ఉనికిని గ్రహించింది. ఆ గేదె వాటి మీదికే ఉరికింది. గదిమింది. అయినా.. అవి వెంటనే వస్తుండటంతో ఆ గేదె సమయస్ఫూర్తితో నీరు తాగుతున్న మొసళ్లు ఉన్న నదిలోకి వెళ్లింది. ఆ సింహాలు గేదె కోసం చూస్తూ చూస్తూ.. అది నీటిలోనే ఉండటంతో వెళ్లిపోయాయి. 

ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను ఎలిఫెంట్ వాక్ రీట్రీట్ మేనేజర్ అయిన ఆంటోనీ బ్రిట్జ్ తీశారు. ఆ తర్వాత వీడియోను ఎలిఫెంట్ వాక్ రిట్రీట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

క్రూగర నేషనల్ పార్క్ ఎంట్రెన్స్‌కు 50 మీటర్ల దూరంలో క్రొకొడైల్ బ్రిడ్జీ దగ్గర ఎలిఫెంట్ వాక్ రిట్రీట్ ఉన్నంది. ఇది క్రొకొడైల్ రివర్‌తోపాటు ఇతర వ్యూ చూడటానికి బాగుంటుంది. అదే రోజు స్టాఫ్ మెంబర్స్‌లో ఒకరైన సిఫో కూడా.. బ్రిట్జ్‌కు కాల్ చేసి గేదె, సింహాలు కనిపించాయని చెప్పాడు.

View post on Instagram
 

వెంటనే తాను ఆ వాటిని కెమెరాలో బంధించినట్టు బ్రిట్జ్ వివరించాడు. ‘అప్పుడు అక్కడ ఒక ఒంటరి గేదె ఉన్నది. నదిలో నీరు తాగడానికి వచ్చింది. అప్పుడే ఓ సింహాల గుంపు కూడా వచ్చింది.   ఆ గేదెను బెదిరిస్తున్నాయి. గేదె గ్రహించి వెంటనే వాటిపైకి ఉరిమింది. సింహాల గుంపులో కొన్ని అప్పుడప్పుడే వేటను నేర్చుకుంటున్న పిల్ల సింహాలూ ఉన్నాయి. అనుభవలేమితో ఆ గేదెను బెదిరించాయి గానీ.. సరైన విధంగా దాడి చేయలేకపోయాయి. గేదెను ఎదురుతిరగడంతో ఆ సింహాలు ఖంగారులో పడ్డాయి. దీంతో కొంత డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఆ సింహాలు ఆశగా ఎదురుచూశాయి’ అని బ్రిట్జ్ తెలిపారు.

Also Read: Odisha Train Tragedy: రైలు ప్రమాదంలో 40 మంది కరెంట్ షాక్‌తోనే దుర్మరణం

ఎంత బెదిరించినా సింహలు వెళ్లకపోవడంతో ఆ గేదె మొసళ్లున్న ఆ నదిలోకే వెళ్లింది. కొంత లోతకు వెళ్లి ఆగి వెనక్కి చూసింది. తీరం వెంట సింహాలు చూస్తూ ఉన్నాయి. ఇక వెనక్కి వెళ్లేది లేదని, ముందుకే నది మధ్యలోకే ఆ గేదె నడించింది. ఇక ఆ గేదెను తినాలనే కోరిక విరమించుకుని సింహాలు తమ దారి ఎంచుకుని వెళ్లిపోయాయి. ఈ వీడియో నెటిజన్లు తెగ ఆకర్షించింది.