ఢిల్లీ మెట్రోలో మరో వీడియో వైరల్.. ప్రియుడి ఒళ్లో పడుకుని.. ముద్దులు పెట్టుకుంటూ...

ఢిల్లీ మెట్రోలో మరో జంట వీడియో వైరల్ అయ్యింది. మెట్రోలో కింద కూర్చున్న ప్రియుడి ఒళ్లో తలపెట్టుకుని పడుకుని.. ముద్దులు పెట్టుకోవడం వైరల్ అయ్యింది. 

Another video viral in Delhi Metro, Couple Kissing In Coach - video viral - bsb

ఢిల్లీ : గత కొంతకాలంగా ఢిల్లీ మెట్రోలో అసహజమైన చర్యల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఓ జంట.. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, మరో వ్యక్తి హస్తప్రయోగం చేసుకోవడం.. ఓ యువతి బికినీలాంటి దుస్తులు ధరించి ప్రయాణించడం లాంటి.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధమైన చర్యలకు ప్రయాణికులు పాల్పడుతున్నారు. 

తాజాగా అలాంటిదే మరో వీడియో వైరల్ అయ్యింది. మెట్రోలో కింద కూర్చున్న ఓ యువతీ యువకులు ముద్దుల్లో మునిగి తేలారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఢిల్లీ మెట్రో తన ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి చేసింది.

"ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, సమాజంలో ఆమోదయోగ్యమైన విధంగానే ప్రవర్తించాలని.. సామాజిక మర్యాదలు, ప్రోటోకాల్‌లను అనుసరించాలని కోరుకుంటున్నట్లు" ఢిల్లీ మెట్రో తెలిపింది.

కేజ్రీవాల్ సర్కార్ కు ఊరట, ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం: సుప్రీంకోర్టు

మెట్రో కోచ్‌లో నేలపై కూర్చున్న యువ జంట ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తన ప్రయాణికులకు “ఇలాంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ".

ఇలాంటి సంఘటనలను చూసినప్పుడు తోటి ప్రయాణికులు వెంటనే "సమీపంలో అందుబాటులో ఉన్న మెట్రో సిబ్బందికి/సిఐఎస్ఎఫ్ కి వెంటనే తెలియజేయాలని, తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చు" అని ప్రయాణికులను మెట్రో అధికారులు అభ్యర్థించారు.

ఈ వీడియో మీద నెటిజన్లు కోపంతోనూ, సరదాగానూ స్పందించారు. వీడియోలో, అమ్మాయి ఒక మెట్రో కోచ్ నేలపై కూర్చున్న అబ్బాయి ఒడిలో పడుకుని ఉంది. ఆ తరువాత వారు ముద్దులు పెట్టుకోవడం.. ఏకాంతంగా ప్రవర్తించడం మిగతా వారికి ఇబ్బందిగా కనిపించింది. 

తేదీ లేని ఈ వీడియో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులకు కోపం తెప్పించింది, వారు ఈ జంటపై చర్య తీసుకోవాలని డీఎంఆర్ సిని కోరారు, అయితే కొందరు ఈ చర్యను వీడియో తీయడాన్ని ప్రశ్నించారు. ఢిల్లీ మెట్రో కోచ్‌లలో చిత్రీకరించిన అనేక వీడియోలు గత కొన్ని నెలలుగా వైరల్ అవుతున్నాయి.

"ప్రయాణికులు అసౌకర్యాన్ని కలిగించే లేదా ఇతర తోటి ప్రయాణీకుల మనోభావాలను కించపరిచే ఎలాంటి అసభ్యకరమైన/అశ్లీల కార్యకలాపాలలో ప్రయాణికులు పాల్గొనకూడదు. డీఎంఆర్ సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చట్టం నిజానికి సెక్షన్ 59 ప్రకారం అసభ్యతను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది" అని డీఎంఆర్ సి పేర్కొంది.

"ఢిల్లీ మెట్రో వంటి సామూహిక ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నప్పుడు ఇటువంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడకుండా, సామాజిక మర్యాదను పాటించండి" అని డీఎంఆర్ సి ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios