Asianet News TeluguAsianet News Telugu

కేజ్రీవాల్ సర్కార్ కు ఊరట, ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం: సుప్రీంకోర్టు


డిల్లీ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య  నెలకొన్న  అధికార పరిధి వివాదంపై  సుప్రీంకోర్టు ధర్మాసనం  ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది.  

Delhi Govt vs LG in Supreme Court :  real power must stay with elected government, says CJI lns
Author
First Published May 11, 2023, 12:11 PM IST

న్యూఢిల్లీ:  ఢిల్లీ పాలన వ్యవహరాలపై  సుప్రీంకోర్టు గురువారంనాడు కీలక తీర్పును వెల్లడించింది. ఢిల్లీ సర్కార్ కు  అధికారాలు లేవన్న  గత తీర్పును  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికి అసలైన అధికారాలు ఉండాలని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికైన  ప్రభుత్వ నిర్ణయాలకు  లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని  సుప్రీంకోర్టు స్పష్టం  చేసింది.  శాంతి భద్రతలు  మినహా  మిగిలిన అంశాలపై  ఢిల్లీ ప్రభుత్వానికే  నియంత్రణ ఉంటుందని  సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. 

ఏకగ్రీవ తీర్పును వెలువరించింది  సుప్రీంకోర్టు ధర్మాసనం. 2019  నాటి సింగిల్ జడ్జి తీర్పుతో  సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. ఢిల్లీ ప్రభుత్వం,  లెఫ్టినెంట్ గవర్నర్ వివాదంపై  సుప్రీంకోర్టు  ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది. ఢీల్లీలో  పాలన వ్యవహరాలు ఎవరు చూడాలన్న విషయమై  సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. 
ఢిల్లీ పాలన వ్యవహరాల్లో  లెఫ్టినెంట్ గవర్నర్ అనవసరంగా  జోక్యం చేసుకోవద్దని  కూడా  సుప్రీంకోర్టు  సూచించింది. 

దేశ రాజధానిలో  అడ్మినిస్ట్రేటివ్  సర్వీసెస్ పై   ఢిల్లీ సర్కార్ కు  అనుకూలంగా  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  మరో వైపు అధికారులపై  కూడా  ప్రభుత్వానికే  నియంత్రణ ఉండాలని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.  రాష్ట్రాల  కార్యనిర్వాహక  అధికారం కూడ  కేంద్ర చట్టాలకు  లోబడి ఉంటుందని  సుప్రీంకోర్టు తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios