Asianet News TeluguAsianet News Telugu

ఆటో డ్రైవర్ ఒడిలో కూర్చున్న కుక్క.. వైరల్ అవుతున్న బెంగళూరు ట్రాఫిక్‌ వీడియో.. నెటిజన్లు ఫిదా..

బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ ఒడిలో కూర్చున్న ఓ కుక్క  వీడియో అది. దాన్ని చూసిన నెటిజన్లు అబ్బురపడుతున్నారు.

A dog sitting on the auto driver's lap.. Bengaluru traffic video goes viral - bsb
Author
First Published May 27, 2023, 10:08 AM IST

బెంగళూరు : బెంగళూరు ట్రాఫిక్ అంటే బెంబేలెత్తాల్సిందే. రోజువారీ ట్రాఫిక్ కష్టాలు వారు చెబితే వినాల్సిందే. అలా ఓ రోజువారి ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఓ మహిళ.. తనతో పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఓ ఆటోడ్రైవర్ ను, అతని ఒడిలోని కుక్కను చూసి అబ్బురపడింది. అతను దాన్ని ఎంత ముందుగా ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటోను శుభ్రం చేస్తున్నాడో చూసి.. దాన్నంతా వీడియో తీసింది. 

దీన్ని ఇంటర్నెట్ లో.. తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇంకేం బెంగళూరు ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఓ కుక్క ఆటోడ్రైవర్ ఒడిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను అల్కా పాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఆమె అమూల్యమైన ఈ క్షణాలను రికార్డ్ చేసింది.

హిందూ యువకుడితో ముస్లిం యువతి డిన్నర్ కు వెళ్లిందని మూక దాడి.. రక్షించేందుకు వచ్చిన ఇద్దరిని పొడిచిన దుండగులు

క్లిప్‌లో ఆటో-రిక్షా డ్రైవర్ తన ఒడిలో కుక్కను కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ బెంగళూరు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఈ నిరీక్షణ సమయంలో కుక్క, డ్రైవర్ ఒకరికొకరు కంపెనీ ఇచ్చుకున్నారు. ఆ వ్యక్తి తన స్నేహితుడి ముఖాన్ని గుడ్డతో తుడిచాడు. ఆ కుక్క కూడా బుద్దిగా.. అటూ,ఇటూ కదలకుండా.. నాకిది మామూలే అన్నట్టుగా కూర్చోవడం..  చూడడానికి చాలా అందంగా ఉంది. మీరు డాగ్ లవర్స్ అయితే, వారి బంధాన్ని మీరు ఇష్టపడతారు.

ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా యూజర్లు కామెంట్ సెక్షన్‌లో వీరిద్దరి బంధంపై ప్రశంసలు కురిపించారు. అతడిని చూస్తుంటే చాలా గౌరవం కలుగుతుంది.. అని ఒకరంటే.. మరొక వినియోగదారు "కేవలం స్వచ్ఛమైన ప్రేమ" ఇది మాత్రమే అని వ్యాఖ్యానించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios