Asianet News TeluguAsianet News Telugu

హిందూ యువకుడితో ముస్లిం యువతి డిన్నర్ కు వెళ్లిందని మూక దాడి.. రక్షించేందుకు వచ్చిన ఇద్దరిని పొడిచిన దుండగులు

హిందూ యువకుడితో ఓ ముస్లిం యువతి డిన్నర్ వెళ్లింది. దీంతో పలువురు ముస్లింలను ఆ జంటను అడ్డగించి, రోడ్డుపైనే దాడి చేసింది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ దుండుగలపై చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులను ఆదేశించారు. 

A Muslim girl went to dinner with a Hindu boy, mob attack.. The assailants stabbed the two who came to rescue..ISR
Author
First Published May 27, 2023, 9:55 AM IST

హిందూ యువకుడితో ఓ ముస్లిం యువతి డిన్నర్ కు వచ్చింది. హోటల్ నుంచి బయటకు వచ్చిన ఈ జంటను ముస్లిం వర్గానికి చెందిన పలువురు గమనించారు. వారి వెంట పడి ఓ చోట ఆపారు. ఆ జంటపై దాడి చేశారు. దీనిని గమనించి, వారిని రక్షించేందుకు వచ్చిన ఇద్దరిపై కూడా కత్తితో పొడిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పల్నాడులో దారుణం.. మద్యం మత్తులో కుమారుడితో గొడవ.. తల నరికి, సంచిలో ఉంచి ఊరంతా తిరిగిన తండ్రి..

పోలీసులు, ‘ఇండియా టు డే’ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ హిందూ యువకుడు, ముస్లిం యువతి గురువారం రాత్రి పట్టణంలోని ఓ హోటల్ కు డిన్నర్ కు వచ్చారు. డిన్నర్ పూర్తయిన వెంటనే హోటల్ నుంచి బయటకు వచ్చి తమ స్కూటీపై బయల్దేరారు. అయితే వీరిని ముస్లిం యువకులు గమనించారు. వారిని వెంబడించారు. ఓ చోట అడ్డగించి, 20 మంది గుంపు ఆ జంటను చుట్టుముట్టింది. ఆ గుంపులోని పలువురు వ్యక్తులు ఆ యువతిని ‘వేరే మతానికి చెందిన వ్యక్తితో ఎందుకు తిరుగుతున్నావ్’ అని ప్రశ్నించారు. తన తల్లిదండ్రులకు విషయం చెప్పి, వారి అనుమతి తీసుకునే ఆ యువకుడితో కలిసి డిన్నర్ కు వచ్చానని ఆ యువతి బదులిచ్చింది.

ఆ గుంపు దురుసు ప్రవర్తనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఆ గుంపు వినకుండా వారిపై దాడి చేశారు. ఈ జంటను రక్షించేందుకు ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. కానీ వారిని కూడా దుండుగులు కత్తితో పొడిచారు. ఈ ఘటనను పలువురు వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో ఈ గుంపుకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగితా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ రఘువంశీ తెలిపారు.

సెల్పీ తీసుకుంటుండగా రిజర్వాయర్ లో ఫోన్ పడిపోయిందని.. 21 లక్షల లీటర్ల నీటిని తోడేసిన గవర్నమెంట్ ఆఫీసర్..

నిందితులపై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు ఏడుగురు నిందితులను గుర్తించామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ కమలేష్ శర్మ తెలిపారు. నిందితుల్లో 23-26 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఇద్దరిని అరెస్టు చేశామని మిగిలిన వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. కాగా.. ఈ జంటను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios