Asianet News TeluguAsianet News Telugu

ఆమెకు 83.. అతడికి 28 ఎనిమిది.. ఫేస్ బుక్ కలిపింది.. దేశాలు దాటి వచ్చి మరీ పెళ్లాడింది..

83యేళ్ల ఓ బామ్మ, 28యేళ్ల ఓ యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఎల్లలు దాటి వారిప్రేమ పండించుకున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

83-year-old woman travels Poland to Pakistan to marry 28-year-old man, vilal news
Author
First Published Nov 8, 2022, 10:03 AM IST

పాకిస్తాన్ : ప్రేమ గుడ్డిదంటారు.. ఎప్పుడు, ఎవరిమీద ఎలా పుడుతుందో చెప్పలేం అంటారు.. అది ఎంత నిజమో కానీ.. కొన్నిసార్లు.. కొన్ని సంఘటనలు ఇది నిజమే అనిపించేలా చేస్తాయి. ఓ 83యేళ్ల బామ్మకు తనకంటే 55 యేళ్లు చిన్నవాడైన యువకుడి మీద మనసయ్యింది. అతని కోసం ఏకంగా దేశం దాటి వచ్చి మరీ అతడిని వివాహం చేసుకుంది. ఆ యువకుడు కూడా ఆ బామ్మను ప్రేమించడంతో వీరి ప్రేమ సుఖాంతం అయ్యింది. తాజాగా ఈ జంట వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది. వినడానికి విచిత్రంగా, వింతగా, ముక్కున వేలేసుకునేలా ఉన్నా.. ఇది పచ్చి నిజం.. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ఇక దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. 83యేళ్ల వయసున్న ఆ బామ్మ పేరు బ్రోమా. పోలాండ్ కు చెందిన ఈమె.. పాకిస్తాన్ కు చెందిన హఫీజ్ నదీమ్ అనే 28యేళ్ల యువకుడిని ఇష్టపడింది. ఇదే విచిత్రం అనుకుంటే.. నదీమ్ కూడా ఆ బామ్మను ఇష్టపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఇద్దరూ నిరుడు నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంట వివాహ వార్షికోత్సవ సంబరాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వాళ్ల లవ్ స్టోరీ ఒక్కసారిగా నెటిజన్లను షాక్ కి గురిచేసింది. 

మొదటి సారిగా రాజకీయాలపై ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్.. ఏమన్నారంటే ?

ప్రేమ ఎలా పుట్టిందంటే..
ఈ మధ్య చాలామంది ప్రేమలో పడడానికి సోషల్ మీడియానే వేదిక అవుతోంది. ఎక్కడెక్కడో ఉన్నవారిని కలిసి.. వారి మనసులను ముడివేస్తోంది. ఇక్కడ కూడా అదే జరిగింది. బ్రోమా, హఫీజ్ నదీమ్ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి ఫేస్ బుక్ వేదికగా మారింది. ఫేస్ బుక్ లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తరువాత స్నేహితులయ్యారు. అలా వారిద్దరి మధ్య క్రమంగా ప్రేమ పుట్టింది. ఈ క్రమంలోనే పెళ్లి అనే బందంతో ఒక్కటవ్వాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. దీంతో బ్రోమా.... పోలాండ్ ను  విడిచి పాకిస్తాన్ లో ల్యాండ్ అయ్యింది. ఆ తరువాత వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. 

బామ్మ సరే.. అతడి అభిప్రాయం ఏంటంటే...
వివాహ వార్షికోత్సవం సందర్భంగా హఫీజ్ మాట్లాడాడు. ఆరేళ్ల క్రితం తొలిసారిగా బ్రోమాతో మాట్లాడినట్టు చెప్పాడు. అంతేకాదు పెళ్లికి ముందు తామిద్దరం ఒక్కసారి కూడా కలుసుకోలేదని తెలిపాడు. వివాహ వేడుకలోనే ఆమెను మొదటిసారి ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పాడు. వివాహ సమయంలో ఇస్లాం సంప్రదాయాలను బ్రోమా చక్కగా పాటించిందని పేర్కొన్నాడు. జీవితాంతం కలిసి జీవించనున్నట్లు వెల్లడించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios