తాడేపల్లి:  చంద్రబాబు ఎంత వయస్సు వచ్చింది అనేది కాదు ఎంతబుద్ది వచ్చింది అనేది ఆలోచించుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి  లక్ష్మీపార్వతి విమర్శించారు. ఐదు సంవత్సరాలలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్ని సంస్దలు,ఎంతమంది వ్యక్తులు ఆరోపణలు చేశారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ పునిహితో అనే ఆయన ఏపిలో ఉన్న పరిస్దితులు అతి దారుణంగా ఉన్నాయని...దీనికంటే బీహార్ ఎంతో నయమని అన్నాడని గుర్తుచేశారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవినీతి విలయతాండవం చేసిందన్నారు. చంద్రబాబు రూ.6.50 లక్షల మేర దోపిడీ చేశారని దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  పుస్తకం కూడా ప్రచురించడం జరిగిందన్నారు. అలాగే  కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా ప్రజావంచన పేరుతో చంద్రబాబు పరిపాలనపై పుస్తకం రాశారన్నారు.  ఇంత అవినీతి చేసిన చంద్రబాబు,లోకేష్ లు రహస్యంగా వందల జిఓలు విడుదల చేశారని ఆరోపించారు.

వారిద్దరు రహస్యంగా విదేశీ ప్రయాణాలు చేసి ఇక్కడ సంపాదించిన డబ్బంతా తీసుకువెళ్లి అక్కడ దాచిపెట్టారని ఆరోపించారు. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం  ఉందన్నారు. చంద్రబాబు అవినీతిపై క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తుల్లో తాను ఒకరినని....అందువల్లే ఆయనపై పలు కేసులు వేశానన్నారు. ఏకంగా ప్రధానిమంత్రి మోడీ సైతం పోలవరంను చంద్రబాబు ఏటిఎంలా వాడుకున్నారని చెప్పడమే ఆయన అవినీతికి పెద్ద ఉదాహరణ అన్నారు.  

read more మాపై కేసులు...బిజెపి పై దాడులు...జనసేనపై విమర్శలు...: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

చంద్రబాబు అవినీతిపై రాష్ర్టపతి,గవర్నర్, ప్రధానిలకు  లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబుపై ఏసిబి కోర్టులో కేసు నడుస్తోందన్నారు. పోలవరం పై వైసిపి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్తే రూ.800 కోట్లు ఆదా అయిందన్నారు. అంటే చిన్న అంశంపై ఇంత మిగిల్తే మిగిలిన అంశాలలో వీరి దోపిడీ ఎంత ఉందో ఊహకందకుండా  వుందన్నారు.ఇన్ని దోపిడీలు చేసి వీరు ఇలా ఎలా తిరుగుతారని అన్నారు.వీరిపై చర్యలు ఉండవా....? అని అన్నారు. మొదటినుంచి చంద్రబాబు అవినీతిపరుడే

నని... ఆయన అవినీతిపై అప్పటి విపక్షాలు పోరాడాయని గుర్తుచేశారు. అవినీతిపై నేడు వైఎస్ జగన్ ఉక్కుపాదం మోపుతున్నారని...అందువల్లే పేదప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారన్నారు. ఈ  ఐదు నెలల్లోనే  ఆయన ఎన్నో సంక్షేమ పథకాలకు ఊపిరిపోశారని...దేశంలో ఏ రాష్ర్టంలో లేనివిధంగా అవినీతికి వ్యతిరేకంగా పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. 

 తన పార్టీ ఎంఎల్ఏలు, మంత్రులుఅవినీతికి పాల్పడ్డారనే చిన్న రిమార్క్ లేకుండా పాలన చేస్తున్నారన్నారు. వందకోట్లు దాటిన వర్క్స్ ఏవైనా ఉంటే రిటైర్డ్ జడ్జి ద్వారా వేసిన కమిటీ ద్వారా ఎలాట్ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం కంటే పొదుపు చర్యలు చేపడుతున్నారు... నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. 

read more జగన్ ది ప్యాక్షనిస్ట్ మనస్తత్వం... సీఎస్ బదిలీకి అదే కారణం..: అచ్చెన్నాయుడు

నిరుద్యోగులకు ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీ చేపడతామని జగన్ ప్రకటించారని తెలిపారు. నిరుద్యోగులకు అదొక పండుగగా జగన్ అభివర్ణించారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశామని... ఇతర రాష్ట్రాల్లో సైతం ఆరోగ్యసేవలు అందేలా చేశామన్నారు. ఆటోడ్రైవర్లకు పదివేల రూపాయలు అందించిన జగన్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారన్నారు. 

గతంలో బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి మోసం చేశారని...ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుధ్దిరాలేదన్నారు. రాజకీయాలకు చంద్రబాబు చీడపురుగని ఘాటుగా విమర్శించారు. గతంలో ఎన్టీఆర్, వైయస్ రాజశేఖరరెడ్డి లు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని...వారి బాటలోనే  జగన్ సంక్షేమరాజ్యాన్ని స్దాపించారన్నారు.