Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ నవశకం పేరిట ఇంటింటి సర్వే: అనర్హుల ఏరివేతే లక్ష్యం

అర్హులందరికీ నవరత్నాలు అందించే లక్ష్యంతో 'వైఎస్సార్ నవశకం' పేరిట... గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం బుధవారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టనుంది

ysr navasakam programme starts today onwards
Author
Vijayawada, First Published Nov 20, 2019, 1:06 PM IST

అర్హులందరికీ నవరత్నాలు అందించే లక్ష్యంతో 'వైఎస్సార్ నవశకం' పేరిట... గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం బుధవారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టనుంది. డిసెంబర్‌ 20 వరకూ సర్వే చేసిన అనంతరం... డిసెంబర్‌ 21 నుంచి 31 వరకూ సమాచారాన్ని మండల స్థాయిలో కంప్యూటరీకరణ చేస్తారు.

జనవరి 2 నుంచి 7 వరకూ వివిథ పథకాల్లో అనర్హుల గుర్తించి పునఃపరిశీలన జరపుతారు. 8న అర్హుల జాబితా ముద్రించి... 9వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో వుంచుతారు. జనవరి 11 నుంచి 13 వరకూ ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు.

15 నుంచి 18 వరకూ గ్రామ సభలు నిర్వహించి ఫిర్యాదులు పరిశీలించనున్నారు. ఈ సర్వే పూర్తయ్యాక... రేషన్‌ బియ్యానికి ఓ కార్డు, సామాజిక పింఛన్లు పొందేందుకు మరొకటి, కుటుంబానికో ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్‌ బియ్యానికి విడిగా కార్డులు ఇవ్వడం వల్ల... అక్రమ దందాకు అడ్డుకట్ట పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Also Read:సీఎం జగన్ మరో కీలక నిర్ణయం: క్రిస్టియన్లకు వరం

ఇవే కాకుండా... కొత్తగా అమలు చేయబోయే పథకాలకు అర్హులను గుర్తించి, ఆయా పథకాలకు సంబంధించి విడివిడిగా కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

విద్యార్ధులకు అమ్మఒడి, నైపుణ్య కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ, పోటీ పరీక్షల శిక్షణకు హాజరయ్యేలా జగనన్న విద్యాకార్డును ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్నవారికి జగనన్న వసతి దీవెన కార్డు ఇవ్వనున్నారు.

వైఎస్సార్ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, కాపునేస్తం, సున్నావడ్డీ పథకం, అమ్మఒడి, దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులు, ఇమామ్స్‌, మోర్జమ్స్‌, పాస్టర్‌లకు ఆర్థికసాయానికి సంబంధించి అర్హులను గుర్తించనున్నారు.

Also Read:మందుబాబులకు జగన్ షాక్: మద్యం ధరల పెంపు

వాలంటీర్లు రోజుకు కనీసం 5 ఇళ్ల సర్వే అయినా చేయాలని అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్సార్ నవశకం పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి... ఆయా జిల్లాల అధికారులు ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లకు మార్గ దర్శకాలు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios