అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలను తగ్గించి ప్రభుత్వమే అమ్మేలా కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్ తాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

బార్లలో అమ్మే మద్యం ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని సమీక్షా సమావేశంలో జగన్ నిర్ణయించారు. 

స్టార్‌ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి తగ్గించాలని సూచించారు. బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలని ఆదేశించారు. ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని అయితే మిగిలినవి విడతల వారీగా తగ్గిద్దామని అధికారులు సీఎం జగన్ కు సూచించారు. 

రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించడంతోపాటు బార్లలో మద్యం సరఫరా వేళలను కుదించింది. బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకేనని కండీషన్స్ పెట్టింది. అయితే రాత్రి 11 వరకూ ఫుడ్ సప్లైకు ప్రభుత్వం ఎలాంటి అబ్జక్షన్స్ పెట్టలేదు.  

మరోవైపు స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమీక్షలో స్పష్టం చేశారు. 

ఇకపోతే మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్‌ చేసినా, నాటుసారా తయారు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే నాన్‌బెయిల్‌ బుల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు.  

లైసెన్స్‌ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ: తిరుపతిలో మద్యం దుకాణాలు బంద్