అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. జెరూసలేం యాత్రికులకు ఆర్థికసాయం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ జెరూసలేం, హజ్ యాత్రికులకు ఆర్థిక సాయంపై చర్చించారు. జెరూసలేం, హజ్ యాత్రికుల ఆర్థిక సాయం పెంపుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 

అందులో భాగంగా మంగళవారం జెరూసలేం యాత్రికుల ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  

అలాగే రూ. 3 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనా స్ధలాల సందర్శనకు ఆర్ధిక సాయం ప్రకటించింది జగన్ సర్కార్. 

ఇకపోతే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పాలనలో దూకుడు పెంచారు. నవరత్నాల అమలుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

అందులో భాగంగా జెరూసలెం, హజ్‌ యాత్రికులకు సీఎం జగన్ ఆర్థిక చేయూత ప్రకటించారు. ఈ యాత్రలకు వెళ్లే వారికి ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వాలు జెరూసలెం వెళ్లే క్రిస్టియన్లకు రూ. 40 వేలు, రూ. 20 వేల చొప్పున సాయం అందజేసేవి.  

వీటితోపాటు వచ్చే ఏడాది మార్చి నుంచి ఇమామ్‌లకు పెంచిన గౌరవ వేతనం రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు అందజేయాలని కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఉగాది పర్వదినాన ఇళ్ల స్థలాల పంపిణీలో మైనార్టీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

అంతేకాదు ప్రతీ ఏడాది భారత్ నుంచి సౌదీలోని హజ్‌కు వెళ్లే ముస్లింల కోటాను 2లక్షలకు పెంచుతూ సౌదీ నిర్ణయం తీసుకుంది. కానీ సుప్రీం ఆదేశాల మేరకు హజ్‌ యాత్రకు ఇచ్చే సబ్సిడీని తగ్గించుకుంటూ వచ్చిన కేంద్రం తర్వాత దాన్ని రద్దు చేయాలని గత ఏడాది ఆరంభంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

Ap cabinet meet photos: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: నేతన్నలకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.24 వేల సాయం.