నా భర్త సంసార జీవితానికి పనికిరాడు... న్యాయం చేయండి: పోలీసులను ఆశ్రయించిన యువతి
తన జీవితాన్ని నాశనం చేసిన భర్తతో పాటు అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. నిజాన్ని దాచి పెళ్లి చేశారంటూ ఆమె ఆరోపిస్తోంది.
వివాహానికి పనికిరాడని తెలిసి కూడా తనను మోసం చేసి పెళ్లి చేశారంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె ఫిర్యాదుపై స్థానిక పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంతో ఆ పంచాయితీ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లింది. తన భర్తతో పాటు అత్తారింటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళ కృష్ణా జిల్లా ఎస్పీని వేడుకుంది.
వివరాలోనికి వెళితే... కృష్ణా జిల్లా వీరులపాడు మండలకేంద్రానికి చెందిన యువతికి ఎంటెక్ చదివింది. ఇటీవల ఆమె పెళ్లి విజయవాడకు చెందిన యువకుడితో అంగరంగ వైభవంగా జరిపారు. ఈ పెళ్ళి కోసం అమ్మాయి తల్లిదండ్రులు దాదాపు 30 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసారు.
అయితే పెళ్లి తర్వాత అత్తారింటికి చేరుకున్న సదరు యువతికి భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆమెను శారీరకంగా దూరం పెట్టడంలో అసలు విషయాన్ని బాధితురాలు గ్రహించింది. సంసార జీవితానికి పనికిరాడని తెలిసినా తనను మోసం చేసి పెళ్లి చేస్తారా అని అత్తింటి వారిని నిలదీసింది. దీంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.
onion crisis video: ఉల్లి కోసం పోరాటం... కిలో మీటర్ మేర క్యూ
తమనే ప్రశ్నిస్తావా అంటూ అత్తింటివారంతా కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయపెడితే ఏకంగా చంపుతానని భర్త బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె కొన్ని రోజులుగా నరకయాతనను అనుభవించింది.
అయితే ఇటీవల ఈ వేధింపులు మరీ ఎక్కువవడంతో ఇక భరించలేకపోయిన ఆమె పుట్టింటివారికి ఈ విషయాన్ని తెలిపింది. దీంతో వారు న్యాయం కోసం వీరులపాడు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీసులు పట్టించచుకోకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా ఎస్పీ రవీంద్ర బాబు పిర్యాదు చేశారు.
పార్టీ మార్పుపై జేసి ఫ్యామిలీ క్లారిటీ... ప్రభాకర్ రెడ్డి, పవన్ రెడ్డిల కామెంట్స్
తనలా ఏ మహిళ ఇబ్బందులు పడకూడదనే తాను పోరాటాన్ని చేస్తున్నట్లు బాధిత మహిళ తెలిపింది. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తింటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అలాగే తమ పిర్యాదుపై సక్రమంగా స్పందించిన స్థానిక ఎస్సైపై కూడా చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ డిమాండ్ చేసారు.