విజయవాడ: కృష్ణా జిల్లాలో చల్లపల్లి మండలం చింతలమడలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన ఓ మహిళ పాముకాటుకు గురై మృతిచెందింది. ఈ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

గ్రామానికి చెందిన సుధాని మహాలక్ష్మి (45) రోజూ మాదిరిగానే పనుల కోసం ఉదయమే పొలానికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో ఆమె పనిలో మునిగిపోయి పరిసరాలను పరిశీలించలేదు.  దీంతో ప్రమాదకరమైన రక్తపింజర పాము ఆమెను కరిచింది.  

read more దివిసీమలో ఒకేరోజు 17మందికి పాముకాట్లు

దీన్ని గమనించిన తోటి కూలీలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మహాలక్ష్మిని చికిత్స కోసం చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే బాగా ఆలస్యమై పాము విషం మహిళ శరీరమంతటికి పాకి మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. 

ఈ విషాద ఘటన మృతురాలి కుటుంబసభ్యులనే కాదు గ్రామస్తులందరిని దుంఖ:లో ముంచింది. ఉదయం ఆరోగ్యంగా పోలంపనులకు వెళ్లిన ఆమె మద్యాహ్నానికి శవంగా మారడంతో కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతంగా వుంది. వారు రోదనలు గ్రామస్తులను ఏడిపిస్తున్నాయి.

read more ''జగన్ ది ''కంత్రి''వర్గం... ముందు బూతు మీడియం తర్వాతే ఇంగ్లీష్ మీడియం''

ఇటీవల కృష్ణా జిల్లా దివిసీమలో పాము కాటు బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు.  గతంలో కేవలం ఒక్కరోజులోనే 17మంది పాముకాటుకి గురయ్యి మృత్యువాతపడ్డారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు చెందిన పది మంది పాము కాటుకు గురయ్యారు.

కోడూరు మండలానికి చెందిన సురేష్, బ్రహ్మయ్య, విశ్వనాథపల్లికి చెందిన నాగ వీరాంజనేయులు, హర్జిత్ మండల్, పెద మాచవరానికి చెందిన వీరాస్వామి, పాదాలవారిపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు, కోడూరుకు చెందిన రామారావు, నాగాయాలంక మండలానికి చెందిన కృష్ణారావు, అవనిగడ్డ మండలానికి చెందిన భీముడు, తుంగలవారిపాలెంకు చెందిన గాలి మురళీకృష్ణ పాముకాటుకు గురయ్యారు. 

గత కొంతకాలంగా దివిసీమలో పాము కాటుకు చాలా మంది బలయ్యారు. వీటిపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. దీంతో మరో ప్రాణం కూడా గాల్లో కలిసిపోయింది.