దివిసీమలో ఒకేరోజు 17మందికి పాముకాట్లు
ఒక్కరోజే 17మంది పాముకాటుకి గురయ్యారు. అవనిగడ్డ, నాగాయలంక,కోడూరు మండలాలకు చెందిన పది మంది పాము కాటుకు గురయ్యారు
కృష్ణా జిల్లా దివిసీమలో పాము కాటు బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. గురువారం ఒక్కరోజే 17మంది పాముకాటుకి గురయ్యారు. అవనిగడ్డ, నాగాయలంక,కోడూరు మండలాలకు చెందిన పది మంది పాము కాటుకు గురయ్యారు... కోడూరు మండలానికి చెందిన సురేష్, బ్రహ్మయ్య, విశ్వనాథపల్లికి చెందిన నాగ వీరాంజనేయులు, హర్జిత్ మండల్, పెద మాచవరానికి చెందిన వీరాస్వామి, పాదాలవారిపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు, కోడూరుకు చెందిన రామారావు, నాగాయాలంక మండలానికి చెందిన కృష్ణారావు, అవనిగడ్డ మండలానికి చెందిన భీముడు, తుంగలవారిపాలెంకు చెందిన గాలి మురళీకృష్ణ పాముకాటుకు గురయ్యారు.
మరో ఏడుగురు పాముకాటు బాధితులు చల్లపల్లి కస్తూర్బా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఘంటసాల మండలం దేవరకోటకు చెందిన పరిశె యశోద, చల్లపల్లి మండలానికి చెందిన కొమ్ముకూరి ఐజాక్, పేరుపోయిన ఓన్సీము, యార్లగడ్డకు చెందిన పల్లెకొండ వాసుదేవరావు, పులిగడ్డకు చెందిన కనకమ్మ, వక్కపట్లవారిపాలెంకు చెందిన కోటేశ్వరమ్మ పాముకాటుకు గురై చల్లపల్లి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా.. గత కొంతకాలంగా దివిసీమలో పాము కాటుకు చాలా మంది బలయ్యారు. వీటిపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.