జగన్ రాజధాని నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ పైకి మాత్రం చెప్పడం లేదన్నారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని. విజయవాడలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు మీద, ఒక కులం మీద కక్షతో ఇలా చేయడం సరికాదన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి దగ్గరగా ఉంటుందని నాని స్పష్టం చేశారు. అమరావతిలో పాలనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తే రాజధానిని మార్చడం ఏంటని కేశినేని ప్రశ్నించారు.

Also Read:సన్న బియ్యం సన్నాసిగాడు: బోస్టన్ కమిటీపై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు

కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు రాజధానిగా అమరావతి కావాలో లేదో చెప్పాలని, రాజధానికి ద్రోహం చేసి చరిత్రహీనులుగా మారవద్దని కేశినేని అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అమరావతి రాజధాని కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారని నాని గుర్తుచేశారు. ప్రాణాలైన అర్పిస్తాం కానీ రాజధానిని మాత్రం కాపాడుకుంటామని కేశినేని స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని బోస్టన్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. తన నివేదికను బోస్టన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందజేశారు. 

Also Read:జగన్ కాదు ఆయన తాత రాజారెడ్డి వల్ల కూడా కాదు: కేశినేని నాని

బోస్టన్ కన్సల్టెన్సీ కంపెనీ ఇచ్చిన నివేదికను హేళన చేస్తూ కేశినేని నాని ట్వీట్టర్ లో వ్యాఖ్యలు చేశారు అది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదిక మాదిరిగా లేదని, సన్నబియ్యం సన్యాసిగాడు ఇచ్చిన నివేదిక మాదిరిగా ఉందని ఆయన అన్నారు. 

"ఇది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన రిపోర్టులాగా లేదుజగన్ మోహన్ రెడ్డి గారూ... సన్నబియ్యం సన్యాసిగాడు ఇచ్చిన రిపోర్టులాగా ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు.