అమరావతి: బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని బోస్టన్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. తన నివేదికను బోస్టన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందజేశారు. 

బోస్టన్ కన్సల్టెన్సీ కంపెనీ ఇచ్చిన నివేదికను హేళన చేస్తూ కేశినేని నాని ట్వీట్టర్ లో వ్యాఖ్యలు చేశారు అది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదిక మాదిరిగా లేదని, సన్నబియ్యం సన్యాసిగాడు ఇచ్చిన నివేదిక మాదిరిగా ఉందని ఆయన అన్నారు. 

"ఇది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన రిపోర్టులాగా లేదుజగన్ మోహన్ రెడ్డి గారూ... సన్నబియ్యం సన్యాసిగాడు ఇచ్చిన రిపోర్టులాగా ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు. 

పోలీసులను ఉపయోగించి ఉద్యమాలను ఆపలేరని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. మందడంలో మహిళా రైతులపై ప్రభుత్వం పాశవిక దాడి అమానుషమని ఆయన అన్నారు. ఉద్యమకారులను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా అమరావతి తరలింపును ఆపాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.