Asianet News TeluguAsianet News Telugu

మూడు కాదు ముప్పై రాజధానులు ఏర్పాటుచేయాలి: జగన్ కు టిడిపి ఎంపీ సవాల్

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యిందని టిడిపి ఎంపీ కనకమేడల  రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.  

tdp mp kanakamedala ravindra kumar challege to CM jagan
Author
Vijayawada, First Published Dec 20, 2019, 7:19 PM IST

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ప్రజల ఆందోళన పరిశీలిస్తే విభజననాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. ప్రభుత్వాలనేవి ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మంచిది కాదన్నారు. వ్యక్తుల మధ్య ద్వేషం కారణంగా రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పరిస్థితులు రావడం మిక్కిలి బాధాకరమని ఆయన వాపోయారు. 

శుక్రవారం కనకమేడల ఆత్మకూరులోని టిడిపి జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2014లో ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక దశ-దిశ చూపి రాజధానిగా అమరావతిని నిర్ణయించి 5 కోట్ల ఆంధ్రులకు మార్గదర్శిగా నిలిచారన్నారు. తన అనుభవం, దీర్ఘకాల పరిశోధన, ప్రధాని సలహాతో అమరావతికి శంఖుస్థాపన చేస్తే ఆ కార్యక్రమానికి నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ హాజరుకాలేదని గుర్తుచేశారు. అదే ఆయనకు ఈ రాష్ట్రంపై ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. 

అధికారంలోకి వచ్చిన జగన్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నారని... ఒక టిడిపి నాయకుడిగానే కాకుండా పౌరుడిగా ఆలోచిస్తుంటే బాధ కలుగుతోందన్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని చెప్పినవారు 6నెలల్లో ఏంనిరూపించారన్నారు. 

గతంలో నాటి ప్రతిపక్షనేతగా జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ అమరావతి నిర్మాణాన్ని విజయవాడ ప్రాంతంలో స్వాగతిస్తున్నానని... ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి తప్పుపట్టడం ఆయన మాట తప్పాడనడానికి, మడమ తిప్పాడనడానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్షనేతగా తాను చేసిన ప్రకటనను తిరగదోడటానికి గల కారణాలేమిటో చెప్పాల్సిన బాధ్యత జగన్‌పైనే ఉందన్నా రు. 

read more విజయసాయి రెడ్డి వియ్యంకుడి ద్వారా విశాఖ కుంభకోణం... ఆధారాలివే: అనురాధ

ముఖ్యమంత్రిహోదాలో ఉన్న వ్యక్తి  ఇప్పుడు అసెంబ్లీలో మూడు రాజధానులంటూ ఊహాజనిత ప్రకటనచేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. పొంతనలేని ప్రకటనలతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేయడం కూడా ముమ్మాటికీ రాజ్యాంగవిరుద్ధమేనన్నారు. తన ప్రకటన వెనకున్న కారణమేమిటో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్‌పై ఉందన్నారు. 

వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను చీకట్లపాలు చేసే అహంకారపూరితమైన ప్రవర్తన ఆయనలో కనిపిస్తోందన్నారు. తన పార్టీ సభ్యులు, మంత్రులకు కూడా చెప్పకుండా అసెంబ్లీలో ఏకపక్ష ప్రకటన చేసిన జగన్‌ రాజధానికి 33వేల ఎకరాలిచ్చిన వారిని వేదనకు గురిచేశాడని కనకమేడల ఆవేదన వ్యక్తం చేశారు. 

మానవ తప్పిదం, బాధ్యతారహితమైన వ్యక్తి ప్రకటన వల్లే రాష్ట్ర పరిస్థితి ఇలా తయారైందన్నారు. రాష్ట్ర ఉనికికి వ్యతిరేకంగా ప్రజల్ని అల్లకల్లోలంచేసే ప్రకటనలు, పనులు రాజద్రోహం కిందికే వస్తాయని, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారే ఈ ద్రోహానికి పాల్పడ్డారని రవీంద్ర కుమార్‌ మండిపడ్డారు.రైతులను పెయిడ్‌ ఆర్టిస్ట్‌లన్నవారే  అసలుసిసలు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లని... వారే అసెంబ్లీలో, బయటా నటిస్తున్నారన్నారు.

 ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అంటే ఏంటో ప్రభుత్వానికి తెలుసా.... ప్రతిపక్ష నేతగా రాజధానిపై జగన్‌ ప్రకటనచేసిన తేదీనుంచి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేసిన తేదీల మధ్యలో ఎవరైనా భూములు కొనిఉంటే చంద్రబాబు కుట్రపన్ని తమపార్టీ నాయకులతో కొనిపించారని చెప్పొచ్చని... అలా జరిగితే దాన్ని ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అంటారని కనకమేడల వివరించారు. 

ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ గురించి తెలీక ప్రజల్ని పక్కదోవపట్టించే ప్రకటనలు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. ఎప్పుడు భూముల క్రయవిక్రయాలు జరిగాయి... ఆకాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఎన్ని, తెలుగుదేశం నాయకులెవరైనా ఉన్నారా అనే వివరాలు చెప్పకుండా ఊరికే ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అంటే ఎవరూ నమ్మరన్నారు. ఆకాలంలో రిజిష్ట్రార్‌ ఆఫీస్‌లో 125 ట్రాన్సాక్షన్లు జరిగాయని, వారిలో తెలుగుదేశం నాయకుడు ఒక్కరూ లేరన్నారు.     

read  more  రాజధాని వివాదం... జగన్ తో కాదు నేరుగా ప్రధాని మోదీతోనే: నాదెండ్ల

విశాఖలో భూములు ధరలు పెరిగాయని రాజధానికి కేంద్రం నిధులివ్వదని, అమరావతిలో రైతులు భూములివ్వలేదని, అన్నీ లాక్కున్నవేనని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్రాన్ని పాలించడం తమాషాకాదన్న టీడీపీనేత, జగన్‌ ప్రభుత్వానికి దమ్ముంటే, పాలనచేతనైతే 30రాజధానులు కట్టిచూపించాలన్నారు.

ముఖ్యమంత్రి 30వేల ఎకరాలు కావాలంటే, మంత్రేమో 300ఎకరాలు చాలని చెప్పడం, మంత్రులు బొత్స, పేర్నినాని, కొడాలినాని సభను తప్పుదోవపట్టించేలా పూటకోతీరుగా మాట్లాడటం, ప్రజలజీవితాలతో ఆడుకోవడం  రాజ్యాంగవిరుద్ధమన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనవ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలని రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. 

ఉద్యమం చేస్తున్న రైతుల్ని అవహేళనచేసేలా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయోజనాలకోసం, చంద్రబాబు చేసిన అభివృద్ధిని తుడిచేయడానికే ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందన్నారు. రైతులుభూములివ్వడం, అక్కడ రూ.9వేలకోట్ల నిర్మాణాలు జరగడం, రోడ్లువేయడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. 13-09-2019న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వివిధప్రాంతాలు, మరియు రాజధాని అభివృద్ధికోసం సలహాలు సూచనలు ఇవ్వాలని ఉందన్నారు.

 ప్రభుత్వం నియమించిన జీ.ఎన్‌.రావుకమిటీకీ  చట్టబద్ధత లేదన్నారు. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ప్రకారం ఆకమిటీకి న్యాయసమ్మతి లేదన్నారు. కమిటీ నివేదిక రాకముందే, జగన్‌ ప్రకటనలు చేయడం ఆకమిటీని ప్రభావితం చేయడం కాదా అని కనకమేడల ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుప్రకారం తనపై ఉన్న 31 కేసులను త్వరగా విచారించి, చర్యలు తీసుకోమని కోరే ధైర్యంలేని జగన్‌, దిశచట్టంద్వారా 21రోజుల్లో దోషులను పట్టుకోవాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు కనకమేడల.     
 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios