విజయవాడ: ప్రపంచాన్ని కరోనా వైరస్ భయాందోళనకు గురిచేస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ ను మాత్రం జగరోనా వైరస్ వణికిస్తోందని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ద్వజమెత్తారు. అంతేకాకుండా అతీంద్రియ శక్తులన్న సీఎం బావ( బ్రదర్ అనిల్ కుమార్) సహాయాన్ని  తుఫాన్ల నియంత్రణకు ఉపయోగించాలంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. ఇలా సీఎం జగన్ పైనే కాకుండా ఆయన కుటుంబంపై కూడా బుద్దా వెంకన్న ట్విట్టర్  వేదికన సెటైర్లు వేశారు. 

''తుఫాన్లను నియంత్రించగల అతీంద్రియ శక్తులు ఉన్నది ఒక్క వైఎస్ కుటుంబానికే. ఎంపీ విజయసాయి రెడ్డి గారు...ఈ విషయం లో బావ సహాయం తీసుకోమని 
సీఎం వైఎస్ జగన్ గారికి సలహా ఇవ్వండి. గతంలో ఎన్నో విపత్తులు ఆపిన అనుభవం ఆయనకు ఉంది.''

''కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు శాస్త్రవేత్తలు మందు తయారు చేస్తారు. కానీ 8 నెలలుగా ఏపీ ప్రజలను పట్టి పీడిస్తున్న జగరోనా వైరస్ కి మాత్రం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మందు తయారు చేస్తారు సాయి రెడ్డి గారు''  అంటూ  సీఎం జగన్ పైనే కాదు ఆయన కుటుంబంపై కూడా వెంకన్న సెటైర్లు విసిరారు. 

read more  దళిత ఎంపీ సురేశ్‌పై దాడి... చంద్రబాబు కుట్ర ఏమిటంటే...: మేరుగు నాగార్జున
 
 ''పెన్షనర్ల కళ్లల్లో వైఎస్ జగన్ గారితో కారం కొట్టించి నిప్పులు పోసుకోవద్దు అంటూ సలహాలు ఏంటి విజయసాయి రెడ్డి సారు. పెన్షన్ల పేరుతో జగన్ గారు చేసిన మోసం అంతా ఇంత కాదు. 3 వేల పెన్షన్ అని 250 రూపాయిలు పెంచారు.''

''పెన్షన్ వయోపరిమితి 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గిస్తూ మొదటి సంతకం చేసారు. 8 నెలలు గడుస్తున్నా 60 ఏళ్లు ఉన్న ఒక్కరికీ పెన్షన్ ఇవ్వకుండా దగా చేసారు. పైగా 7 లక్షల పెన్షన్లు ఎత్తేసారు. ఇప్పుడు పెన్షన్ డోర్ డెలివరీ అంటూ మరో స్కామ్ మొదలెట్టారు.''

read more  మారేది ముఖ్యమంత్రే, రాజధాని కాదు... చంద్రబాబు నిర్ణయాన్నీ వ్యతిరేకించా..: మాజీ మంత్రి

''రూ.2 వేల పెన్షన్ ఇవ్వడానికి గ్రామ వాలంటీర్ల పేరుతో 50 రూపాయిలు కొట్టేస్తున్నారు. వృద్ధులకు చెందాల్సిన 27 కోట్లు ఇంటికి తెచ్చినందుకు మామూళ్లుగా కొట్టేస్తున్నారు. వృద్ధుల సొమ్ము కొట్టేయమని చెప్పిన మీ బ్యాచ్ కి పుట్టగతులు ఉండవు సాయిరెడ్డి గారు!!'' పెన్షన్లను డోర్ డెలివరీ చేస్తున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ మరో కుట్రకు తెరతీసిందని బుద్దా వెంకన్న ఆరోపించారు.