Asianet News TeluguAsianet News Telugu

దళిత ఎంపీ సురేశ్‌పై దాడి... చంద్రబాబు కుట్ర ఏమిటంటే...: మేరుగు నాగార్జున

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ నందిగం సురేశ్ పై టిడిపి శ్రేణులు దాడికి ప్రయత్నించడంపై ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.

YSRCP MLA Merugu Nagarjuna reacts attack on MP Nandigam Suresh
Author
Amaravathi, First Published Feb 3, 2020, 4:49 PM IST

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, దళిత ఎంపి నందిగం సురేశ్ పై దాడికి టిడిపి నాయకుల ప్రయత్నించడం ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అకృత్యాలు పరాకాష్ట కు చేరుకోడాన్ని తెలియజేస్తుందన్నారు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున. దళిత ఎంపీపై దాడి వెనుక చాలాపెద్ద కుట్ర దాగివుందని పేర్కొన్నారు. ఈ దాడి దళితుల పట్ల చంద్రబాబుకు వున్న వ్యతిరేకతను తెలియజేస్తుందన్నారు.

నందిగం సురేశ్ పై పెయిడ్ వర్కర్స్ తో చంద్రబాబే దాడి చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. అంటరానితనం ఇంకా చంద్రబాబు మదిలో,ఆలోచనలో ఉందని  విమర్శించారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ పోరాడటం ఎలాగో నేర్పించారని... చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని హెచ్చరించారు.  దళితుల భూములను లాక్కుని చంద్రబాబు తన బినామిలకు అప్పగించారని ఆరోపించారు. 

''చంద్రబాబూ...అసెంబ్లీలో ఎస్సి కమీషన్  విషయంలో బిల్లుపెడితే వ్యతిరేకించావు. మండలిలో మోకాలడ్డావు. నీ గ్యాంగ్ తో దళితులను టార్గెట్ చేస్తున్నావు. గతంలో మా ఎంఎల్‌ఏలు కైలే అనిల్ కుమార్, శ్రీదేవి గార్లపై కూడా దాడులు చేయించావు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దికి సీఎం జగన్ ముందుకు వెళ్తుంటే ఆయనను అభాసుపాలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు'' అని నాగార్జున మండిపడ్డారు. 

read more  వైసిపి ఎంపీపై దాడికి టిడిపి విద్యార్థి విభాగం ప్రయత్నం... 20మందిపై కేసు

శ్రీభాగ్ ఒప్పందంలోని అంశాలను పరిశీలించి, అనేక అధ్యయనాల తర్వాతే ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్తున్నారని... వీటన్నింటిని పట్టించుకోకుండా చంద్రబాబు కేవలం రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. పేదప్రజల కోసం జగన్ అనేక చట్టాలు తెస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశంసించారు. 

అమరావతిలో ఉద్యమం వెనుక చంద్రబాబు కుట్ర దాగివుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో కొల్లగొట్టిన ఆస్తులు పోతాయనే భయంతో కాపాడుకునేందుకు ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఆలోచన ఏంటంటే తనకు చెంచాగిరి చేసే మీడియా సంస్థలను ఉపయోగించి సీఎం జగన్ పై దుష్ప్రచారానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. 

video  ఎంపీ నందిగం సురేశ్‌కి రాజధాని సెగ

జగన్ సిఎం అయ్యాక పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అభివృధ్ది, సంక్షేమ పధకాలతో ప్రతి ఇల్లు తడుతున్నారని కొనియాడారు.పెన్సన్లను ఇంటి వద్దే అందించడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే రెండుకోట్ల మందికి సంక్షేమ పధకాలు అందాయని ఎమ్మెల్యే వెల్లడించారు. 


  

Follow Us:
Download App:
  • android
  • ios