అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు మతం లేదని... మానవత్వమే తన మతం అంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గుర్తుచేశారు. అయితే సీఎం చెప్పినట్లు ఆయన మతం మానవత్వం కాదని మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు  

వైఎస్సార్‌సిపి ఆరునెలల పాలనలో రాష్ట్రానికి మొత్తం రూ.67వేల కోట్ల నష్టం జరిగిందని  ఆరోపించారు. రాష్ట్రంలో మధ్య నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు విఫలమయ్యాయని అన్నారు. ప్రభుత్వమే మద్యం  షాపులను నడుపుతుండటంతో వాటి పక్కనే బెల్టు షాపులు వెలిశాయని... దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని అన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్ష బెల్ట్ షాపులు నడుస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పడిపోయాయని అన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వీటన్నింటికి కప్పిపెట్టి తాము చేపట్టిన చర్యలు సక్సెస్ అయినట్లు చెబుతోందని అన్నారు.    

read more  మేం రెచ్చిపోతే తట్టుకోలేరు... జాగ్రత్తగా వుండండి: చంద్రబాబు హెచ్చరిక

రాష్ట్ర రెవెన్యూ -17శాతానికి పడిపోయిందని...రూ.30వేల కోట్లు ఆదాయాం పడిపోయిందన్నారు. కేవలం ఈ ఆరు నెలల్లోనే రూ.25వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. జగన్ మంచి ముఖ్యమంత్రి కాదు ముంచే ముఖ్యమంత్రి అనడానికి ఇవే సాక్ష్యాలని తెలిపారు. పోలవరంలో టీడీపీ నిర్ణయాలన్నీ నియమ నిబంధనలు ప్రకారమే అని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. 

కక్ష, వివక్షలే ఈ ప్రభుత్వ ప్రధాన అజెండాలని విమర్శించారు. సామాన్య మహిళ యలమంచిలి పద్మజ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకున్నారు?అని ప్రశ్నించారు. మంత్రులకో న్యాయం సాధారణ పౌరులకు మరో న్యాయమా అంటూ నిలదీశారు. సామాన్యుల ఆర్ధిక మూలాలు దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహారం ఉందని ఉమ విమర్శించారు.

read more  జగన్ చేతకాకపోతే గద్దె దిగు, ఎన్నికల్లో తేల్చుకుందాం: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు