కర్నూలు: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా తాను రాజధాని అమరావతిలో పర్యటనకు వెళితే తట్టుకోలేకపోయిన వైసిపి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చెప్పులు, రాళ్లు వేయించిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేకాకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న మంత్రులు ప్రజా సమస్యలపై కాకుండా బూతులు మాట్లాడుతున్నారని... వారి మాటలు విని ప్రజలే సిగ్గుపడుతున్నారని అన్నారు. బూతులు మాట్లాడే వారిని మంత్రులుగా కాకుండా బూతుల మంత్రులుగా పిలవాలని సూచించారు. 

కర్నూల్ జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...లక్షా 50 వేల రూపాయాలు ఫర్నీచర్ తీసుకెళ్లాడని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వైసిపి ప్రభుత్వం అవమానపరిచిందన్నారు. ఆ అవమానం భరించలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

read more  ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు... కేబినెట్ కార్యదర్శితో సిఎస్ చర్చలు

అంతేకాకుండా అన్యాయంగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని చంపేశారని అన్నారు. ఆయన హత్య ఇంటి దొంగల పనేనని అన్నారు. ఆయన హత్య జరిగిన సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి కేసు నీరు గార్చకుండా విచారణ చేయించానని అన్నారు. టీడీపీలో చురుగ్గా ఉన్నవాళ్ళపై కక్ష సాధించడం కోసం కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహించారు. 

ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసి దారుణంగా చంపడం హేమమైన చర్య అని అన్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ఏవిదంగా ఉందో ఈ దారుణాన్ని బట్టే అర్థం అవుతుందని పేర్కొన్నారు. మహిళలు ఎవరూ ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్నారు. నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని.. ఇది ఉన్మాద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. 

read more  ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు... ఏపిలో గణనీయంగా తగ్గిన మద్యం వినియోగం, విక్రయాలు

కొంత మంది ఏపి పోలీసులు చాలా అతి చేస్తున్నారని అన్నారు. తాము రెచ్చిపోతే ఎవరూ తట్టుకోలేరు... జాగ్రత్త గా వుండటంటూ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ తో ఆటలు ఆడుతున్నవారు జాగ్రత్త... అదే మీ పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ధైర్యం ఉంటే తమతో రాజకీయంగా పోటీ పడదండి... తమ ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించడం అని చంద్రబాబు సూచించారు. 

వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస, దుర్మార్గపు పాలన సాగిస్తోందని చంద్రబాబు ఆగ్రహించారు. ఈ  ఆరునెలల్లో వీరు కక్షసాధింపులకు పాల్పడటం రాష్ట్ర అభివృదద్ది కోసం చేసిందేమీ లేదని చంద్రబాబు ఆరోపించారు.