జగన్! చేతకాకపోతే గద్దె దిగు, ఎన్నికల్లో తేల్చుకుందాం: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

కనీసం ఉల్లిని కూడా సక్రమమైన రీతిలో ప్రజలకు అందించలేని ఈ చేతకాని‌ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని అలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని తక్షణమే ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 
 

Janasena chief Pawan kalyan sensational comments on CM  YS Jagan government

చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పాలన చేతకాకపోతే దిగిపోవాలంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటడంతో తిరుపతి రైతు బజార్ లో పర్యటించారు జనసేనాని.  

ఉల్లి ధరలు అమాంతం పెరెగిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రైతు బజార్లో పర్యటించినట్లు తెలిపారు. నిన్న మెున్నటి వరకు ఇసుక ధర, ఇప్పుడు ఉల్లిధరలు భగ్గుమంటున్నాయని ఆరోపించారు. 

ఉల్లిధరలపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనే వాళ్లు అమ్మే వాళ్లు ఇద్దరూ నష్డాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉల్లిధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు నియంత్రించలేం అన్న అంశాలపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పాలన చేతకాకపోతే అధి కారం వదిలి దిగిపోవాలంటూ ఘాటుగా హెచ్చరించారు. 

అధికారానికి గుడ్ బై మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలే వాళ్లకు నమ్మకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారంటూ తేల్చి చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ప్రభుత్వాలకు పాలించే హక్కులేదన్నారు.  

కనీసం ఉల్లిని కూడా సక్రమమైన రీతిలో ప్రజలకు అందించలేని ఈ చేతకాని‌ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని అలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని తక్షణమే ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇప్పటికైనా ఉల్లిధరలను నియంత్రించకపోతే ఇసుక ఉద్యమం మాదిరిగా ఉల్లి కోసం ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని ప్రజలకు నిత్యవసరమైన ఉల్లిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios